‘పెద్ది’లో జాన్వీ కపూర్‌ కొత్త సీన్స్‌.. వివాదం ఇంతటితో ఆగేనా! | Buchi Babu Says New Scenes Will Add In Peddi Movie | Sakshi
Sakshi News home page

‘పెద్ది’లో జాన్వీ కపూర్‌ కొత్త సీన్స్‌.. వివాదం ఇంతటితో ఆగేనా!

Jun 14 2026 5:08 PM | Updated on Jun 14 2026 5:27 PM

Buchi Babu Says New Scenes Will Add In Peddi Movie

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తోంది. జూన్‌ 4న విడుదలైన ఈ చిత్రం 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 378 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌ అయిన రోజు నుంచి జాన్వీ కపూర్‌ పాత్రపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సినిమాలో ఆమెను చూపించిన తీరు, డైలాగ్స్‌ పై సామాన్యులే కాదు సినీ తారలు కూడా అభ్యంతరం చెప్పారు.

 చివరకు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి ఆ సీన్లను తొలగించారు కూడా. అయినా కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. దీనికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టాలని బుచ్చిబాబు భావిస్తున్నారు. అందుకే సినిమాలో కొన్ని కొత్త సీన్లను యాడ్‌ చేయబోతున్నారట. ఈ విషయాన్ని తాజాగా బుచ్చిబాబే చెప్పారు.‘పెద్దిలో కొత్తగా మూడు సీన్లను యాడ్‌ చేయబోతున్నాం. అందులో జాన్వీ కపూర్‌కి సంబంధించి రెండు సీన్లు ఉన్నాయి. మరొకటి జగపతి బాబు సన్నివేశం. ఈ మూడు సీన్లను బుధవారం నుంచి యాడ్‌ చేయబోతున్నాం’ అని బుచ్చిబాబు చెప్పాడు.  మరి కొత్త సన్నివేశాలు యాడ్‌ చేసిన తర్వాత అయినా జాన్వీ కపూర్‌ పాత్రపై పాజిటివ్‌ టాక్‌ వస్తుందో లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement