పెద్ది మూవీ హీరోయిన్.. అందుకే దూరంగా ఉందా? | Why Janhvi Kapoor Not appears In Peddi Movie Promotions | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: పెద్ది ప్రమోషన్స్‌కు దూరంగా హీరోయిన్.. ఆ కారణం వల్లేనా?

May 15 2026 3:37 PM | Updated on May 15 2026 3:55 PM

Why Janhvi Kapoor Not appears In Peddi Movie Promotions

ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరి చూపులు పెద్ది సినిమా వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ నెల 18న పెద్ది ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. డైరెక్టర్ బుచ్చిబాబు సనా సైతం పెద్ది ప్రమోషన్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే పెద్ది మూవీ గురించి మరో చర్చ మొదలైంది. ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మూవీ ప్రమోషన్స్ వీడియోల్లోనూ జాన్వీ పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ పెద్ది ప్రమోషన్స్‌కు దూరంగా ఉండడంపై టాలీవుడ్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

కారణం అదేనా??

అయితే జాన్వీ కపూర్  కేవలం భారీ రెమ్యూనరేషన్ కోసమే ఈ ప్రాజెక్టుకు సంతకం చేసిందని ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్లే ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ఓ కథనంలో వెల్లడైంది.ఈ  విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ట్రైలర్ రిలీజ్‌కు వేడుకలోనైనా జాన్వీ కపూర్ కనిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ముంబయిలో ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రమోషన్ల విషయంలో జాన్వీ వెనక్కి తగ్గితే అది ఆమె కెరీర్‌పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ‘పెద్ది’ లాంటి పాన్ ఇండియా చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే ‍అవకాశాన్ని బాలీవుడ్ బ్యూటీ మిస్ చేసుకున్నట్లే. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement