తెలుగు సినీ పరిశ్రమను పైరసీ భూతం ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. ఇలా థియేటర్స్‌లో విడుదల కాగానే అలా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్ అందుబాటులోకి వచ్చేస్తోంది. ‘పెద్ది’ని కూడా పైరసీ బూతం వదల్లేదు. విడుదలైన రెండో రోజే పెద్ది చిత్రానికి సంబంధించిన హై క్వాలిటీ హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది.
(చదవండి: పెద్ది మూవీ రివ్యూ)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం..జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. తొలి రోజు ఈ చిత్రం భారీ కలెక్షన్లను కూడా రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 135 కోట్ల గ్రాస్ వసూలు సాధించినట్లు మేకర్స్ ప్రటించారు.అంతేకాదు వీకెండ్‌లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు సినీ పండితులు వెల్లడించారు. ఇలాంటి తరుణంలో చిత్రబృందానికి భారీ షాక్ తగిలింది. సినిమాకు సంబంధించని హెచ్‌డీ ప్రింట్ ప్రముఖ పైరసీ వెబ్‌సైట్‌లో ప్రత్యేక్షమైంది.
సినిమా లాంగ్ రన్ కలెక్షన్లపై దీని ప్రభావం పడుతుందేమోనని ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పైరసీ లింకులను వెంటనే ఇంటర్నెట్ నుంచి తొలగించాలని వారు సైబర్ క్రైమ్ పోలీసులను, డిజిటల్ టీమ్‌ను సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
@AlwaysRamCharan Peddi movie is streaming online in some site. Someone has forwarded me the link. I can’t send the link here in public. Let me know where to send so you can ask the concern to restrict the site.
— Kiran Surya Nadella (@kiran_nadella) June 5, 2026


