అతనితోనే జాన్వీ కపూర్‌ పెళ్లి.. బోనీ కపూర్ ఏమన్నారంటే? | Boney Kapoor Responds on Janhvi and Shikhar getting married news | Sakshi
Sakshi News home page

Boney Kapoor: ఈ ఏడాదిలోనే జాన్వీ కపూర్‌ పెళ్లి.. బోనీ కపూర్ ఏమన్నారంటే?

May 4 2026 4:18 PM | Updated on May 4 2026 4:43 PM

Boney Kapoor Responds on Janhvi and Shikhar getting married news

దేవర  మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్‌లో రిలీజ్ కానుంది.  

అయితే బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌పై గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ ఏడాది జాన్వీ పెళ్లి చేసుకోనుందని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్ పహారియాను పెళ్లాడనుందని  ఊహాగానాలొస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జాన్వీ కపూర్ పెళ్లి పీటలెక్కనుందని లేటేస్ట్ టాక్. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ స్పందించారు.

తన కూతురు ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలను బోనీ కపూర్ ఖండించారు. జాన్వీ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. దీంతో పెద్ది బ్యూటీపై వస్తున్న పెళ్లి వార్తలకు చెక్ పడింది. అయితే గతంలో కాఫీ విత్ కరణ్ షోకు హాజరైన జాన్వీ కపూర్‌.. శిఖర్‌తో తన రిలేషన్ గురించి మాట్లాడింది. తామిద్దరం డేటింగ్‌లో ఉన్నామని తెలిపింది. అంతేకాకుండా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపించడంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు అర్థమైపోయింది. గతంలో శిఖర్ గురించి జాన్వీ కపూర్ పాజిటివ్ కామెంట్స్ చేసింది. అతను నాతో ఉంటే సేఫ్‌గా ఉంటాననే ఫీలింగ్ వస్తుందని జాన్వీ తెలిపింది. అతనికో నేను ఒక చిన్నపిల్లలా ఉండగలనని చెప్పింది. శిఖర్‌తో తప్ప మరెవరితోనూ నేను ఇంత సరదాగా గడపలేనని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement