కాలి నడకన తిరుమలకు.. ఎందుకు వెళ్తానంటే? | Janhvi Kapoor open about going To Tirumala on Foot to visit the temple | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: కాలి నడకన తిరుమలకు.. ఎందుకు వెళ్తానంటే?

Apr 5 2026 4:51 PM | Updated on Apr 5 2026 4:58 PM

Janhvi Kapoor open about going To Tirumala on Foot to visit the temple

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్‌ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్‌  రెజ్లర్ లుక్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జాన్వీకపూర్‌కు తిరుమలను తరచుగా సందర్శిస్తూ ఉంటారు. అమ్మ శ్రీదేవి బాటలోనే ప్రతి ఏటా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఎప్పుడు తిరుమలకు వెళ్లినా కాలి నడకనే కొండపైకి చేరుకుంటుంది జాన్వీ. సెలబ్రిటీ అయినప్పటికీ కాలి నడకన వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తుంది. దీని వెనుక గల ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ.

తాను తిరుమలకు కాలి నడకన వెళ్లేందుకు గల కారణాలను వివరించింది జాన్వీ కపూర్. తాజాగా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది. కాలినడకన ప్రయాణించడం వల్ల కలియుగ దైవం బాలాజీకి మరింత దగ్గరైనట్లు అనిపిస్తుందని తెలిపింది. ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవమని తనకు చాలా  ఇష్టమని పేర్కొంది. భక్తితో మెట్లు ఎక్కి ఇష్టదైవమైన శ్రీవారి చెంతకు చేరడాన్ని ఒక గొప్ప సౌభాగ్యంగా భావిస్తానని జాన్వీ కపూర్ వెల్లడించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement