'పెద్ది' ఇంకెన్నాళ్లు? అప్‌డేట్ ఇచ్చిన బుచ్చిబాబు | Peddi Movie Shooting Latest Update | Sakshi
Sakshi News home page

Peddi Movie: ఎట్టకేలకు ముగిస్తున్నారు.. బుచ్చిబాబు పోస్ట్ వైరల్

Apr 21 2026 5:20 PM | Updated on Apr 21 2026 5:25 PM

Peddi Movie Shooting Latest Update

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా షూటింగ్ సాగుతూ..నే ఉంది. లెక్క ప్రకారం గత నెలలో రిలీజ్ అని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. తీరా డేట్ దగ్గరపడేసరికి నెల తర్వాత అంటే ఏప్రిల్ 30 పక్కా విడుదల చేస్తామని ఏకంగా పోస్టర్ వదిలారు. కొన్నిరోజుల ముందు మళ్లీ వాయిదా అని షాకిచ్చారు. జూన్‌లో వస్తుందని ప్రకటించారు కానీ డేట్ చెప్పలేదు. జూన్ కూడా వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ టైంలో దర్శకుడు బుచ్చిబాబు.. షూటింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. పోస్ట్ పెట్టాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా)

మరో ఆరు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుందని చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు.. 'మై పెద్ది' అని క్యాప్షన్ ఇచ్చి రామ్ చరణ్‌తో దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే ఐటమ్ సాంగ్ చిత్రీకరణ చివరలో పెట్టుకున్నారనమాట. ఈ పాటలో చరణ్‌తో డ్యాన్స్ చేసేందుకు హీరోయిన్ సంయుక్తని తీసుకున్నారని రూమర్స్ వచ్చాయి. బహుశా ఈమెనే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయితే రెహమాన్ వర్క్ మొదలవుతుంది. ఈయన టైంకి ఔట్‌పుట్ డెలివరీ చేస్తేనే జూన్‌కి సినిమా వస్తుంది. లేదంటే మళ్లీ వాయిదా తప్పదు.

విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా తీస్తున్న 'పెద్ది'లో చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లు. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులోని ఐటమ్ సాంగ్ కోసం మృణాల్ ఠాకుర్, మానస వారణాసి తదితరుల పేర్లు వినిపించాయి. ఈ స్పెషల్ సాంగ్ కోసం బ్యూటీ దొరక్కే షూటింగ్ ఇన్నాళ్ల పాటు ఆలస్యమైందనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఏదైతేనేం ఎట్టకేలకు షూటింగ్ అయితే ముగించేస్తున్నారనమాట.

(ఇదీ చదవండి: అందరూ ఫెయిల్! మలయాళీ సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?)

Advertisement
 
Advertisement
Advertisement