ఓ యువ విద్యార్థి లేవనెత్తిన సందేహం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. జార్ఖండ్‌కు చెందిన పదిహేడేళ్ల సార్థక్ సిద్ధాంత్ 12 వ తరగతి చదువుతున్నాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ ఏడాది 12వ తరగతి పరీక్ష మూల్యాంకనానికి ఆన్ స్క్రీన్ మార్కింగ్‌ను ప్రవేశపెట్టింది. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయని, మూల్యాంకనంలో లోపాలు ఉన్నాయని ఆరోపించారు.
కాస్త లోతుగా విశ్లేషించాలని సీబీఎస్‌ఈ విడుదల చేసిన డాక్యుమెంట్లు, పాత టెండర్లను డౌన్‌లోడ్ చేసుకుని పరిశీలించి చూశాడు సార్థక్. నిబంధనల మార్పు జరిగిందని, కొన్ని క్లాజులను సడలించారని, మరిన్ని లోపాలు కూడా ఉన్నాయని తన బ్లాగ్‌లో వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. అధికారులు అప్రమత్తమయ్యారు.
సార్థక్ ఆరోపించిన అంశాలను సవివరంగా తెలుసుకోదలచి అతడినే సీబీఎస్‌ఈ ర్లమెంటరీ ప్యానల్‌కి ఆహ్వానించారు. కమిటీలో సీబీఎస్‌ఈ చైర్మన్ రాహుల్ సింగ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సార్థక్ ఇచ్చిన ప్రజెంటేషన్‌లో తాను గుర్తించిన పలు లోపాలను వారికి వివరించాడు. మొత్తానికి జార్ఖండ్ విద్యార్థి లేవెనెత్తిన ప్రశ్న దేశవ్యాప్తంగా ఉన్న విద్యావ్యవస్థ పరీక్షగా మారింది.
(చదవండి: ‘గ్రాండ్‌ఫేర్‌వెల్’.. ఆ మాస్టారుకి గురుదక్షిణగా ఏకంగా కారు!)


