వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో ఉన్న ఇండియన్ సినిమా 'హౌమ్ బౌండ్'. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అఫీషియల్‌గా దీనికి ఎంట్రీ దొరికింది. థియేటర్లలోకి రావడానికి ముందే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై ప్రశంసలు కూడా అందుకుంది. అలాంటిది ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుంది.
ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కరోనా కష్టాలు, కులం కారణంగా ఎదురయ్యే అవమానాలు, ఉద్యోగాల్లో ఎదురయ్యే అణిచివేత, ఆర్థిక అసమానతలు తదితర అంశాలని తీసుకుని ఈ సినిమా తీశారు. పలు చిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకోగా.. సెప్టెంబరు 26న థియేటర్లలో రిలీజ్ చేశారు. యావరేజ్ టాక్ దగ్గరే అగిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం నవంబరు 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
(ఇదీ చదవండి: 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. రాజమౌళి కామెంట్)
'హౌమ్ బౌండ్' విషయానికొస్తే.. మహమ్మద్ షోయబ్ అలీ(ఇషాన్ ఖట్టర్), చందన్ కుమార్ (విశాల్ జెత్వా) ఫ్రెండ్స్. వీళ్లిద్దరూ ముస్లిం, దళిత వర్గానికి చెందిన వాళ్లు కావడంతో సమాజంలో అవమానాలు, అణిచివేతకు గురవుతారు. దీంతో పోలీస్ కానిస్టేబుల్ అయితే తమకు గౌరవం లభిస్తుందని వీళ్లిద్దరూ భావిస్తారు. పరీక్ష రాస్తారు. ఫలితాలు రావడం ఆలస్యం కావడంతో కుటుంబ పరిస్థితుల కారణంగా ఓ కంపెనీలో అలీ ఉద్యోగానికి చేరతాడు. సుధ(జాన్వీ కపూర్) కోసం చందన్ కాలేజీలో చేరతాడు.
మరి కలిసి ఉండే అలీ, చందన్ మధ్య గొడవలు ఎందుకొచ్చాయి? కాలేజీ మానేసిన చందన్.. ఆఫీస్ బాయ్ ఉద్యోగం వదిలేసిన షోయబ్.. సూరత్ వెళ్లి ఫ్యాక్టరీలో పనికి ఎందుకు చేరారు?వీరిద్దరి జీవితాల్లో కరోనా ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేది మిగతా సినిమా. ఇద్దరు స్నేహితులుగా ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా అద్భుతంగా నటించారు. ఓ చిన్న పాత్రలో ఎలాంటి మేకప్ లేకుండా జాన్వీ కపూర్ ఆకట్టకుంది.
(ఇదీ చదవండి: గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. ఒక్క సంఘటనతో రాజమౌళి ఫ్రస్టేషన్!)


