తొలిసారి రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురు చూశారు. దీంతో దర్శకధీరుడు సైతం సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు ఇచ్చాడు. ప్రియాంక చోప్రా లుక్‌తో ఏకంగా సాంగ్ రిలీజ్ చేశారు. అంతే కాకుండా భారీ ఈవెంట్‌తో టైటిల్ గింప్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఈ గ్రాండ్ జరిగింది.
ఇంత భారీ ఎత్తున చేసిన ఈవెంట్‌లో ఓ చిన్న సంఘటన రాజమౌళికి కోపం తెప్పించింది. ఆడియన్స్‌కు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఈ మూవీ గ్లింప్స్‌ను ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ చేయాలని భావించాం.. అందుకే టెస్టింగ్ చేయాలనుకున్నామని రాజమౌళి తెలిపారు. కానీ ఈ గ్లింప్స్ టెస్ట్ ప్లే సమయంలో కొందరు డ్రోన్ విజువల్స్‌తో లీక్ చేయడం నిరాశ కలిగించిదన్నారు. ఎందుకంటే ఇది కోట్ల రూపాయల బడ్జెట్, ఎంతో మంది శ్రమతో రూపొందించామని.. ఇలా చేయడంపై దర్శకధీరుడు బాధగా ఉందన్నారు. నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చినట్లుగా మా కంటెంట్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని అన్నారు. ఈ సంఘటనతో మేం సరిగ్గా పరీక్షించలేకపోయామని వెల్లడించారు.
కాగా.. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు రుద్రగా కనిపించనున్నారు. తాజాగా రిలీజైన టైటిల్ గ్లింప్స్ ప్రిన్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'గ్లోబ్‌ట్రాటర్' పేరుతో ఈ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించారు. వారణాసి చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


