రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ నిర్ణయించారు. ఈ మేరకు స్పెషల్ వీడియోని 'గ్లోబ్ ట్రాటర్'లో ప్రసారం చేశారు. విజువల్స్ అన్నీ టాప్ నాచ్ ఉండగా.. అభిమానులు దీన్ని చూసి మైమరిచిపోయారు. ఇదే అనుకుంటే.. ఈ సినిమాలో మహేశ్ బాబు శ్రీరాముడిగా నటించారని చెప్పి రాజమౌళి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా 60 రోజుల పాటు రాముడి ఎపిసోడ్ చిత్రీకరించామని చెప్పారు.
(ఇదీ చదవండి: మహేశ్ బాబు 'వారణాసి'.. 2027 వేసవిలో రిలీజ్)
'తొలిరోజు ఫొటోషూట్‌లో మహేశ్ బాబుని శ్రీరాముడిగా రెడీ చేసి ఫొటోలు తీశాం. అయితే మహేశ్, కృష్ణుడి పాత్రకు బాగా సూట్ అవుతాడని అనుకున్నా. కానీ ఆ రోజు మహేశ్.. నా అంచనా తప్పు అని నిరూపించాడు. దీంతో మహేశ్ రాముడి గెటప్ ఫొటోని నా వాల్ పేపర్‌గా పెట్టుకున్నాను. కానీ ఎవరు చూసేస్తారేమో అనుకుని దాన్ని తీసేశాను. రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. మహేశ్‌ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటోషూట్ తీస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. రాముడి ఎపిసోడ్‌ని 60 రోజుల పాటు తీశాం. రీసెంట్‌గానే అది పూర్తయింది. ఇందులో చాలా సబ్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. ఈ ఒక్క ఎపిసోడ్.. నాకు, మహేశ్ కెరీర్‌లోనే మర్చిపోలేని సీక్వెన్స్' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: 30 నిమిషాల ఫైట్.. మహేశ్ విశ్వరూపం చూశా: విజయేంద్ర ప్రసాద్)


