మహేశ్ బాబుతో రాజమౌళి ఓ సినిమా చేస్తున్నారు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైనప్పటికీ ఒక్క అప్‌డేట్ కూడా రిలీజ్ చేయలేదు. మిగతా యాక్టర్స్ నుంచి కూడా ఒక్కటి కూడా బయటకు రానీయకుండా జాగ్రత్తపడ్డారు. అలాంటిది ఇప్పుడు 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో భారీ ఎత్తున హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించారు. సినిమా గురించి డీటైల్స్ బయటపెట్టారు.
ఇదే కార్యక్రమంలో మాట్లాడిన మూవీ టీమ్ అంతా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రానికి సంగీతమందించిన కీరవాణి కూడా చాలా మాట్లాడారు. పనిలో పనిగా మూవీ రిలీజ్ ఎప్పుడనేది కూడా చూచాయిగా బయటపెట్టారు.
'మహేశ్ బాబు ఫ్యాన్స్.. మీ అందరి హృదయాల్లో పర్మినెంట్‌గా ఉండిపోటానికి ఒక కొత్త ఫ్లాట్ కొన్నా. బిల్డర్ హ్యాండోవర్ చేసేసాడు. ప్రొడ్యూసర్ హ్యాపీ. డైరెక్టర్ హ్యాపీ. టైల్స్ ఏత్తన్నారు. మెలోడీ నాదే బీటు నాదే. సమ్మర్ 2027కి గృహప్రవేశం' అని కీరవాణి చెప్పుకొచ్చారు.
కీరవాణి చెప్పడమైతే చెప్పారు గానీ 2027 వేసవిలోనే కచ్చితంగా రిలీజ్ అవుతుందా అంటే సందేహమే. ఎందుకంటే రాజమౌళి తీసే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా పలు కారణాల వల్ల ఆలస్యం కావడం, ముందు అనుకున్న విడుదల తేదీ వాయిదా పడటం తెలిసిందే. మరి ఈసారైనా కీరవాణి చెప్పినట్లు 2027 వేసవిలోనే వస్తారా లేదా అనేది చూడాలి?


