రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ | Ram Charan Peddi Movie Trailer Released, Watch Trailer Packs Action, Emotion And Cricket Drama | Sakshi
Sakshi News home page

Peddi Trailer: ఆకట్టుకునేలా చరణ్ 'పెద్ది' ట్రైలర్

May 18 2026 4:06 PM | Updated on May 18 2026 4:49 PM

Peddi Movie Trailer Latest Update

మెగా హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. లెక్క ప్రకారం మార్చిలోనే రావాలి కానీ రెండుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వచ్చే నెల 4న థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంటూ మూవీపై అంచనాలని పెంచేస్తోంది.

(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక)

బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే పనోడు.. క్రికెట్, కుస్తీలో ఎలాంటి ప్రతిభ చూపించాడు. జీవితంలో ఇతడికి ఎదురైన సవాళ్లు ఏంటనేది కాన్సెప్ట్. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆ జోష్‌ని కొనసాగించేలానే ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)

Advertisement
 
Advertisement
Advertisement