ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు | Bheemseri And Dream Catcher Movies OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT Movies: రెండు తెలుగు మూవీస్.. ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్

May 18 2026 3:28 PM | Updated on May 18 2026 3:34 PM

Bheemseri And Dream Catcher Movies OTT Streaming Now

మరోవారం వచ్చేసింది. ఈసారి సతీ లీలావతి, సిస్టమ్, మధువిధు, మేం కాప్‌లం లాంటి తెలుగు మూవీస్, సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరోవైపు థియేటర్లలో 'దృశ్యం 3' రిలీజ్ కానుంది. ఈ వీకెండ్‌కి అయితే ఇదే ఎంటర్‌టైన్‌మెంట్. అయితే సడన్ గా ఓ రెండు తెలుగు చిత్రాలు ఒకే ఓటీటీలోకి స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. రిలీజైన 12 రోజులకే)

గతేడాది జనవరిలో థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'డ్రీమ్ క్యాచర్'. ప్రశాంత్ కృష్ణ, అనీషా దామా, ఐశ్వర్య హోళక్కల్ ప్రధాన పాత్రలు చేశారు. కలలో వచ్చిన సంఘటనలు నిజజీవితంలో ఒకవేళ జరిగితే హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఈ కలలు రావడం అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది కాన్సెప్ట్. ఇప్పుడీ చిత్రం ఏడాదిన్నర తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇకపోతే సుమన్, మహేశ్ పెగ్గర్ల, సిరి తదితరులు నటించిన 'భీంసేరి' అనే తెలుగు సినిమా కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఇది కూడా రెంట్ విధానంలోనే అందుబాటులోకి వచ్చింది. ఓ క్రూరమైన లేడీ పోలీసాఫీసర్.. ఓ నిరుపేద కుటుంబాన్ని అన్యాయంగా నాశనం చేస్తుంది. కానీ ఆ కుటుంబంలో ఓ మహిళ ప్రాణాలతో బయటపడుతుంది. ఈమె సదరు లేడీ పోలీసాఫీసర్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement