'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక | Rashmika Praise Kriti Sanon With That Word | Sakshi
Sakshi News home page

Rashmika: తోటి హీరోయిన్‌ని పొడుగుతూ రష్మిక టంగ్ స్లిప్

May 18 2026 2:56 PM | Updated on May 18 2026 3:10 PM

Rashmika Praise Kriti Sanon With That Word

సాధారణంగా నటీనటులు ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడుతుంటారు. స్టార్స్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉంటారు. కొన్నిసార్లు మాత్రం పొరపాటులో నోరు జారుతుంటారు. హీరోయిన్ రష్మిక కూడా ఇప్పుడు అలానే చేసింది. తోటి హీరోయిన్‌ని పొగుడుతూ టంగ్ స్లిప్ అయింది. వెంటనే నాలిక్కరుచుకుంది. ఇంతకీ ఏమైంది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

స్వతహాగా కన్నడ అమ్మాయి అయినప్పటికీ రష్మిక.. తెలుగు సినిమాలతోనే బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. హీరో విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయిపోయింది. హిందీలోనూ మూవీస్ చేస్తున్న ఈమె నటించిన 'కాక్‌టెయిల్ 2' వచ్చే నెల 19న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది.

ఈ కార్యక్రమంలోనే తోటి హీరోయిన్ కృతి సనన్ గురించి చెబుతూ '****' అనే బూతుని పొరపాటున ఉపయోగించింది. వెంటనే క్షమాపణ కూడా చెప్పేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రష్మిక, కృతిసనన్ హీరోయిన్లుగా కాగా షాహిద్ కపూర్ హీరో. అయితే ఈ మూవీలో రష్మిక-కృతి సనన్.. స్వలింగ సంపర్క పాత్రల్లో కనిపించనున్నారనే రూమర్స్ గతంలో వచ్చాయి. 

(ఇదీ చదవండి: తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్.. స్పందించిన హీరోయిన్‌ తల్లి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement