రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పెద్ది. పెద్దిపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లుక్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో చరణ్‌కు మూడో లుక్ కూడా ఉందని తెలుస్తోంది. కానీ దాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారట. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఫిట్‌నెస్ ట్రయినర్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.
పెద్ది సినిమా తొలి టీజర్‌లో చరణ్ పల్లెటూరి క్రికెటర్‌గా కనిపించాడు. ఇటీవల పెద్ది పహిల్వాన్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ రెండూ మాత్రమే కాకుండా చరణ్‌కు ఈ చిత్రంలో మరో లుక్ కూడా ఉందనేది తాజా సమాచారం. ఈ మూడో లుక్ మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరికీ పెద్ద సర్‌ప్రైజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
ఇక ఇదిలా ఉంటే.. మరోవైపు పెద్ది విడుదల తేదీపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు జూన్ చివరి వారం రిలీజ్ అని ప్రకటించాడు. కానీ ఇప్పుడు కొత్త ఊహాగానం చెలరేగుతోంది. టాక్సిక్ విడుదల వాయిదా పడటంతో ఆ తేదీకి, అంటే జూన్ 4వ తేదీకి పెద్ది వస్తుందనే ప్రచారం మొదలైంది.
చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


