'పెద్ది' బడ్జెట్ ఎంత? అంచనాలు ఎలా ఉన్నాయి? | Peddi Movie Expectations And Esteemed Collection | Sakshi
Sakshi News home page

Peddi Movie: 'పెద్ది' టార్గెట్ చాలా పెద్దది.. స్పెషల్ కూడా

Jun 2 2026 3:15 PM | Updated on Jun 2 2026 3:55 PM

Peddi Movie Expectations And Esteemed Collection

టాలీవుడ్ ఊపిరి పీల్చుకునే టైమొచ్చేసింది. ఎందుకంటే 'పెద్ది' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి 'మన శంకరవరప్రసాద్'తో వచ్చి హిట్ కొట్టిన తర్వాత ఒక్కటంటే ఒక్క మూవీ కూడా సరిగా ఆడలేదు. మోస్తరు కలెక్షన్స్‌తో మమా అనిపించినవి ఒకటో రెండో ఉన్నాయంతే. అందుకే ఇప్పుడు అందరూ 'పెద్ది'పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి దీనిపై అంచనాలు ఎలా ఉన్నాయి? బడ్జెట్ ఎంత? వసూళ్లు ఎంత రావాలి?

'ఉప్పెన' అనే ఒకే ఒక్క సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబు 'పెద్ది' తీశాడు. ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చినప్పుడు.. ఈ స్క్రిప్ట్ తొలుత ఎన్టీఆర్ దగ్గరకెళ్లి వచ్చిందనే రూమర్స్ వచ్చాయి. కానీ దీన్ని చరణ్ కోసమే రాసుకున్నానని ప్రమోషన్లలో బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో అంతా రిలాక్స్ అయిపోయారు.

మొదటగా వచ్చిన గ్లింప్స్ నుంచి లేటెస్ట్‌గా రిలీజైన 'మస్సా మస్సా' పాట వరకు ప్రతిదానికి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. హీరోహీరోయిన్, సహయనటులు, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా ఎవరిని కదిపినా సరే ఆహాఓహో అనే రేంజులోనే 'పెద్ది' గురించి చెబుతూ వచ్చారు. హీరో రామ్ చరణ్ అయితే మగధీర, ఆర్ఆర్ఆర్ చిత్రాలని మించి ఇది ఉంటుందని అన్నాడు. దీంతో అభిమానులు గట్టిగానే అంచనాలు పెంచేసుకున్నారు.

సగటు ప్రేక్షకుల్లో మాత్రం 'పెద్ది'పై యావరేజ్ అంచనాలు ఉన్నట్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగు ఆడియెన్స్ గత కొన్నేళ్లుగా చూసుకుంటే చాలా కాలిక్యులేటెడ్‌గా థియేటర్లకు వెళ్తున్నారు. 'పెద్ది'కి కూడా పాజిటివ్ టాక్ వస్తేనే వెళ్తారు తప్పితే స్టార్ హీరో సినిమా కదా అని వెళ్లిపోరు. ఎందుకంటే స్కూల్స్ మొదలయ్యే సమయమిది. పిల్లలకు అవసరమైన బుక్స్, బ్యాగ్స్ లాంటి వాటికి మధ్య తరగతి తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి టైంలో 'పెద్ది' వైపు చూడాలంటే కచ్చితంగా అద్భుతమైన టాక్ రావాల్సి ఉంటుంది. మరి దీన్ని ఈ సినిమా ఏ మేరకు నిలబెట్టుకుంటుందనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

మరోవైపు టాలీవుడ్ ‍కూడా 'పెద్ది'పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. సంక్రాంతి తర్వాత నుంచి థియేటర్లన్నీ బోసిపోయాయి. ఎగ్జిబిటర్లు, బయ్యర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పుడు వీళ్లందరిలో జోష్ రావాలంటే 'పెద్ది' బ్లాక్‌బస్టర్ హిట్ కావాల్సి ఉంటుంది. దీనికి రూ.350 కోట్ల బడ్జెట్ అయిందని స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు.. విజయవాడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు. థియేట్రికల్ బిజినెస్ రూ.200 కోట్లకుపైనే జరిగింది. అంటే కనీసంలో కనీసం రూ.500-600 కోట్లకు మించి కలెక్షన్ రావాలి. అప్పుడే నిర్మాత, ఎగ్జిబిటర్లు అందరూ లాభాలు అందుకుంటారు. అలా జరగాలంటే ఉత్తరాదిలో దీనికి అద్భుతమైన టాక్ రావాలి!

విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ సినిమాలో చరణ్.. పెద్ది అనే క్రాస్ ఓవర్ అథ్లెట్.. అంటే క్రికెట్, కుస్తీ, రన్నర్‌గా కనిపిస్తాడు. ట్రైలర్ బట్టి, దర్శకుడు చెప్పిన దానిబట్టి చూస్తే మాస్ మూమెంట్స్ కంటే బలమైన ఎమోషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏఆర్ రెహమాన్ అందించిన చికిరి చికిరి, రయ్ రయ్ రారా పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. బుచ్చిబాబు టేకింగ్‌పైనా అందరికీ నమ్మకముంది. అందుకే 'పెద్ది' చాలా స్పెషల్‌గా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement