పెద్ది ఐటమ్‌ సాంగ్‌.. సోషల్ మీడియాను ఊపేస్తోంది..! | Ram Charan and Buchi Babu peddi Movie special Song creates Record | Sakshi
Sakshi News home page

Ram Charan: పెద్ది ఐటమ్‌ సాంగ్‌.. రిలీజైన కొన్ని గంటల్లోనే రికార్డ్..!

May 25 2026 3:01 PM | Updated on May 25 2026 3:17 PM

Ram Charan and Buchi Babu peddi Movie special Song creates Record

రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇ‍ప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇటీవలే ఈ చిత్రంలోని స్పెషల్‌ సాంగ్‌ను కూడా విడుదల చేశారు.

హల్లల్లలో అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్ చరణ్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ ప్రత్యేక పాటలో కోలీవుడ్ భామ శృతిహాసన్‌ తన డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించింది. తాజాగా ఈ సాంగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో విడుదలైన కొన్ని  గంటల్లోనే ఊహించని రెస్పాన్స్‌ సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా 50 మిలియన్లకు (5 కోట్లకు) పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో చెర్రీ సరసన జాన్వీ  కపూర్‌ హీరోయిన్‌గా మెప్పించనుంది. మరోవైపు ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

 
 

 

Advertisement
 
Advertisement
Advertisement