'అశ్లీల సైట్‌లో నా ఫోటోలు.. బాయ్స్ చూసేవారు' | Janhvi Kapoor recalls seeing her morphed images on online site | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: 'అశ్లీల సైట్‌లో నా ఫోటోలు.. స్కూల్లో ఉన్నప్పుడు చుశా'

Apr 5 2026 2:22 PM | Updated on Apr 5 2026 5:02 PM

Janhvi Kapoor recalls seeing her morphed images on online site

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్‌ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్‌  రెజ్లర్ లుక్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 

అయితే పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన టీనేజ్‌లో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. తనకు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ అశ్లీల సైట్‌లో తన మార్ఫింగ్ చిత్రాన్ని చూశానని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తాను పాఠశాలలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందని జాన్వీ కపూర్ గుర్తుచేసుకున్నారు. మా క్లాస్‌లో కొందరు అబ్బాయిలు సరదా కోసం అలాంటి సైట్స్ చూసేవారని.. ఆ సమయంలో నా ఫోటోలు చూశానని తెలిపింది. నేను చదివే పాఠశాలలోనే ఇలా జరగడంతో చాలా వింత అనుభవాన్ని ఎదురైందని జాన్వీ కపూర్ వివరించింది.

ఆ సమయంలో తాను ఆ పరిస్థితిని సర్దుకుపోవడానికి ప్రయత్నించానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అలా నా ఫోటోలు చూశాక సోషల్ మీడియాకు సంబంధించి ఇలాంటి చాలా విషయాలలో నైతికత లేదని అనిపించిందని జాన్వీ తెలిపింది.   అయితే ఇప్పుడు వాటిపై తన దృక్పథం మారిందని.. ఏఐ (AI) రూపొందించిన ఈ చిత్రాలు ఈ రోజుకు తనను ప్రభావితం చేస్తున్నాయని జాన్వీ కపూర్‌ తన బాధను పంచుకుంది. 

ఇలాంటి పరిస్థితుల్లో తనకు సంతోషం అనేది లేదని జాన్వీ వెల్లడించింది. ఏఐ రూపొందించిన తన ఫోటోలు ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్నాయని.. కొన్నిసార్లు అధికారిక వార్తా పేజీలు కూడా వాటిని షేర్ చేస్తున్నాయని వివరించింది. ఇలాంటి మార్ఫింగ్, ఏఐ ఫోటోల్లో తాను ఎప్పుడూ ధరించని దుస్తులు, పోజులు ఉన్నాయని జాన్వీ కపూర్‌ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇలా సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసేవారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రియులు కోరుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement