కాజోల్‌ను నాతో చూడగానే కోపం తెచ్చుకునేవాడు: షారుక్‌

Shah Rukh Khan Reveals Why His Son AbRam Did Not Like Kajol - Sakshi

బాలీవుడ్‌ ఆన్‌స్క్రీన్‌ పాపులర్‌ పేర్‌లో షారుక్‌ ఖాన్‌-కాజోల్‌ అగ్రస్థానంలో ఉంటారు. తెరపై ఈ జంట పండించే ప్రేమకు సినీ ప్రేమికులంత ఫిదా అవ్వక తప్పదు. దీనికి ఉదాహరణ వారిద్దరూ నటించిన ‘దిల్‌ వాలే దుల్హానియా లే జాయేంగే, బాజీగర్‌, కుచ్‌ కుచ్‌ హోతా హై, కభీ ఖుషి కభీ ఘమ్‌’ చిత్రాలే. ఈ మూవీలో ప్రేమికులుగా ఈ జంట వందకు వంద శాతం మార్కులు కొట్టేశారు. అంతేగాక వారిద్దరూ నటించిన సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. అందుకే షారుక్‌-కాజోల్‌ హిట్‌ పెయిర్‌గా నిలిచారు.

చదవండి: రోహన్‌తో శ్రద్ధా కపూర్‌ ప్రేమ వ్యవహరం, స్పందించిన శక్తి కపూర్‌

ఇక ఆ తర్వాత సుదీర్ఘ విరామంతో తర్వాత వీరిద్దరూ ‘దిల్‌వాలే’ మూవీతో మరోసారి జతకట్టిన సంగతి తెలిసిందే. 2015లో వచ్చి ఈ చిత్రం మంచి సక్సెస్‌ను అందుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుక్‌ ‘దిల్‌వాలే’ మూవీ సమయంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను పంచుకున్నాడు. కాగా షారుక్‌ ఎటు వెళ్లిన అతడి చిన్న కుమారుడు అబ్‌రాంను వెంట తీసుకుని వెళ్తాడనే విషయం తెలిసిందే. అయితే దిల్‌వాలే మూవీ షూటింగ్‌కు కూడా అబ్‌రాంను ప్రతి రోజు సెట్‌కు తీసుకుని వెళ్లవాడట.  కాగా, తన చిన్న కుమారుడు అబ్‌రాంకు కాజోల్‌ అంటే ఇష్టం ఉండేది కాదంటూ షారుక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

చదవండి: భర్త రాజ్‌కుంద్రాకు శిల్పా విడాకులు ఇవ్వబోతోందా?!

‘ప్రతి రోజు లాగే ఓ రోజు అబ్‌రాంను తీసుకుని ‘దిల్‌వాలే’ షూటింగ్‌కు వెళ్లాను. షూటింగ్‌ అనంతరం డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టి ఆ రోజు సన్నివేశాలను కెమెరాలో చూపించేవాడు. ఈ మూవీలో నేను గాయపడిన సన్నివేశం ఆ రోజు చిత్రీకరించారు. అది చూపించేటప్పుడు ఆ సీన్‌ చూసి అబ్‌రాం ఆ గాయాలు నాకు కాజోల్‌ వల్లే అయ్యాయని భావించాడు. దీంతో కాజోల్‌ పట్ల కోపం తెచ్చుకున్నాడు. ‘పాపా తూత్‌ గయా(నాన్నకు దెబ్బ తగిలింది) అంటూ కాజోల్‌ వంక సీరియస్‌గా చూస్తూ గట్టిగా అరిచాడు. ఇక అప్పటి నుంచి కాజోల్‌ నేను మాట్లాడుకున్న, మేము ఇద్దరం కలిసి కనిపించిన వాడికి నచ్చేది కాదు. స్రీన్‌పై కూడా తనతో నన్ను చూసినప్పుడు అబ్‌రాం గుర్రుగా చూస్తుంటాడు. ఇప్పుడు అది గుర్తు చేసుకుంటుంటే చాలా సరదాగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం షారుక్‌ పఠాన్‌, సంకి సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top