రోహన్‌తో శ్రద్ధా ప్రేమ వ్యవహరం, స్పందించిన తండ్రి శక్తికపూర్‌

Shakti Kapoor Opens Up On daughter Shraddha And Rohan Shrestha Wedding Rumors - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఫోటోగ్రాఫర్‌ రోహన్‌ శ్రేష్టతో ఆమె ప్రేమ లోకంలో విహరిస్తున్నట్లు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత మార్చిలో శ్రద్ధా కజిన్‌ వివాహా వేడుకకు రోహన్‌ హాజరు కావడం, ఆ వేడుకలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు బి-టౌన్‌లో ఎక్కడ చూసిన వీరిద్దరూ జంటగా కనిపించడం, విందులు వినోదాలకు జంటగా హాజరు కావడంతో నిజంగానే వీరు ప్రమలో మునిగితెలుతున్నారని అందరూ ఫిక్స్‌ అయ్యారు. అంతేకాదు ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతోందనే వార్తలు కూడా వెలువడుతున్నాయి.

చదవండి: భర్త రాజ్‌కుంద్రాకు శిల్పా విడాకులు ఇవ్వబోతోందా?!

ఇదిలా ఉండగా రోహన్‌, శ్రద్ధాల ప్రేమ, పెళ్లి పుకార్లపై ఆమె తండ్రి, నటుడు శక్తికపూర్‌లు స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘రోహన్‌ ఫ్యామిలీ ఫ్రెండ్‌. అతడి తండ్రి రాకేష్‌ శ్రేష్ట్‌ నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయం. తరచూ మేము ఫ్యామిలీ మీటింగ్స్‌లో కలుసుకుంటూనే ఉంటాం. రోహన్‌ ఎప్పుడూ మా ఇంటికి వస్తుంటాడు. కానీ శ్రద్ధాను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు అతడు నా దగ్గర ప్రస్తావించలేదు. ఇదంత పక్కన పెడితే ఈ రోజుల్లో పిల్లలు సొంతంగా నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఒకవేళ శ్రద్ధా తన జీవిత భాగస్వామని తానే చూసుకున్నానని చెప్పినా ఒప్పుకునేందుకు సిద్దంగా ఉన్నాను. తన ఇష్టాన్ని గౌరవిస్తాను. అయినా నేనేందుకు తిరస్కరిస్తా?. అయితే ప్రస్తుతం శ్రద్ధా తన కేరీర్‌పై ఫోకస్‌ పెడుతోంది.

చదవండి: పీకల్లోతు కష్టాల్లోకి బాలీవుడ్‌.. నార్త్ ఆడియెన్స్ కు ఏమైంది?

అయితే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా ముఖ్యమైనది. కానీ ప్రస్తుత కాలంలో కొందరూ సొంతంగా నిర్ణయాలు తీసుకోని పెళ్లి చేసుకుంటున్నారు, ఆ తర్వాత సులువుగా విడిపోతున్నారు. అలాంటివి చూసినప్పుడు నాకు కాస్తా కంగారుగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ‘శ్రద్ధా, సిద్దాంత్‌ కపూర్‌(శక్తికపూర్‌ కుమారుడు, శ్రద్దా సోదరుడు) ఇష్టాలను నేనేప్పుడు కాదనను. తన నటిస్తానని చెప్పినప్పుడు నేను నిరాకరించానని అన్నారు. అలా నేను ఎందుకు చేస్తాను. ఓ తండ్రిగా నా కూతురు షైన్‌ అవుతుంటే గర్వపడతాను కదా. తనని నేను ‘గోల్డ్‌ గర్ల్‌’ అని ముద్దుగా పిలుచుకుంటాను’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇటీవల శ్రద్దా కపూర్‌ కజిన్‌ ప్రియాంక శర్మ కూడా శ్రద్ధా, రోహన్‌ల ప్రేమ, పెళ్లీపై హింట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి తానేమి మట్లాడలేనని, త్వరలోనే మీకే తెలుస్తుందంటూ ఆమె చెప్పకనే చెప్పింది. అదే విధంగా ఇలాంటి ఏమైన ఉంటే, వారు పెళ్లి చేసుకుంటే మీకు కూడా పిలుపు అందుతుంది కదా అంటూ ఆమె స్పష్టం చేసింది.
(చదవండి: శ్రద్ధా కపూర్‌ పెళ్లి; వాళ్లకు ఇష్టమైతే నేను సిద్ధమే!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top