పీకల్లోతు కష్టాల్లోకి బాలీవుడ్‌.. నార్త్ ఆడియెన్స్ కు ఏమైంది?

Bollywood in Deep Trouble with Low Box Office Collections - Sakshi

సినిమాలు తీసేది ఎవరికోసం...ఆడియెన్స్ కోసం....వారి ఆదరిస్తే చాలు, నిర్మాత కళ్లలో ఆనందం కనిపిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మనగలుగుతుంది. కాని బాలీవుడ్ లో ఇందుకు భిన్నమైన సిచ్యూవేషన్స్ కనిపిస్తున్నాయి. కొత్త సినిమాపై అక్కడి ఆడియెన్స్ ఏమాత్రం కనికరం చూపించడం లేదు. కొత్తగా విడుదల అవుతున్న సినిమాలకు మినిమం వసూళ్ల లేక విలవిల్లాడుతున్నాయి.ఆడియెన్స్ థియేటర్స్ వైపు చూడకపోవడంతో దర్శకనిర్మాతల్లో టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది.

బెల్‌ బాటమ్‌ రూ.20 కోట్ల మార్క్‌ దాటలేదు
అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్ రిలీజై 10 రోజులవుతున్నా వసూళ్లు మాత్రం 20 కోట్ల మార్క్ దాటలేదు. చెహ్రే అనే మరో మల్టీస్టారర్ మూవీ కూడా ఇటీవలే విడుదలైంది. అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హాష్మీ లాంటి స్టార్స్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా తొలి రోజు వసూళ్లు 50 లక్షలు దాటలేదు..ఈ వసూళ్లను చూస్తున్న నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దాదాపు 18 నెలలుగా బాలీవుడ్ బాక్సాఫీస్ డల్ గా ఉంది.

బాలీవుడ్ కు ఎక్కువ శాతం వసూళ్లను అందించే రాష్ట్రం. మహారాష్ట్ర.అక్కడ థియేటర్స్ ఇప్పటికీ తెరుచుకోకపోవడం అనేది హిందీ సినీ పరిశ్రమను చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. మినిమం వసూళ్లను కూడా అందుకోలేకపోతోంది. బెల్ బాటమ్, చెహ్రే తర్వాత సెప్టెంబర్ 10న కంగనా నటించిన తలైవి చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ మూవీతోనైనా బాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ ఫామ్ అందుకుంటుందా  లేదా అన్నది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top