పిల్లలతో కలిసి వేరుగా ఉండేందుకు ప్లాన్‌!

Is Shilpa Shetty Give Divorce To Her Husband Rajkundra - Sakshi

Shilpa Shetty Divorce: బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి తన భర్త రాజ్‌కుంద్రాకు విడాకులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. రాజ్‌కుంద్రాతో విడిపోయి తన పిల్లలతో కలిసి జీవించాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇటీవల రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫి కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. అశ్లీల చిత్రాల‌ను నిర్మిస్తూ యాప్‌లో విడుద‌ల చేస్తున్నార‌న్న ఆరోపణలపై గ‌త నెల 19న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు రాజ్‌కుంద్రాను అరెస్టు చేశారు. సాక్ష్యాలు కూడా అతడికి వ్యతిరేకంగా ఉండటంతో జైలుకు కూడా వెళ్లాడు. జూడిషియల్‌ కస్టడీలో ఉన్న అతడు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు.

చదవండి: ‘బాహుబలి’తో రాని గుర్తింపు, సార్పట్టకు వచ్చింది: నటుడు

అయితే రాజ్‌కుంద్రా అరెస్ట్‌తో ప్రస్తుతం శిల్పా శెట్టి ఆమె కుటుంబం గడ్డు పరిస్థితులను చూస్తున్నారు. అవమానంతో ఆమె కొద్ది రోజులు పాటు ఇంటి నుంచి బయటకు రాకుండ షూటింగ్‌లకు గైర్హాజరు అయ్యింది. ఈ మధ్యే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్న శిల్పా ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో తాను తప్పు చేశానంటూ ఓ పోస్ట్‌ షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. శిల్పా షేర్‌ చేసిన పోస్ట్‌లో..‘తప్పులు అందరూ చేస్తారు కానీ ఆ తప్పులు భయంకరంగా, ఇతరులను బాధించేలా ఉండకూడదు’ అని రాసి ఉంది.  అంతేగాక తప్పు చేశాను కానీ వాటిని సరిదిద్దుకుంటాను అంటూ ఆమె పోస్ట్‌లో పేర్కొనడంతో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రాతో విడిపోనుందా? అంటూ వార్తలు పుట్టుకురావడం ప్రారంభం అయ్యాయి. 

చదవండి: నేను తప్పు చేశాను, మరేం పర్లేదు: శిల్పాశెట్టి

అంతేగాక రాజ్‌కుంద్రా అక్రమంగా సంపాదించిన డబ్బును కూడా ఆమె ముట్టుకోవద్దని భావిస్తున్నట్లు సమాచారం. భర్త అశ్లీల చిత్రాల వ్యవహరం తెలియగానే శిల్పా షాక్‌కు గురయ్యిందని, ఈ విషయం అప్పటి వరకు తనకు తెలియదని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. దీంతో శిల్పా భర్తతో విడిపోవాలనుకుంటుందని, తన పిల్లలతో కలిసి వేరుగా ఉండేందుకు ఆమె ప్లాన్‌ చేసుకుంటున్నట్లు బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఇంతకాలం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన శిల్పా ఇకపై నటించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శిల్పాకు ఆమె భర్తకు మధ్య ఉండే గొడవలు తక్కువేం కాదని, వారి మధ్య ఇంతకు ముందు కూడా తరచూ ఏవొక సమస్యలు వస్తూనే ఉండేవని రాజ్‌కుంద్రా అరెస్టు అనంతరం ఆమె సన్నిహితులు పేర్కొన్నారు. దీంతో ‘శిల్పా తన భర్తతో విడిపోవడం ఖాయమే’ అంటూ నెటిజన్లు, పరిశ్రమలోని కొందరూ అభిప్రాయపడుతున్నారు. ఇందులో నిజమెంత ఉందో శిల్పా శెట్టి స్పందించే వరకు వేచి చూడాలి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top