
ప్రతీ ఏడాది ముంబైలో జరిగి దసరా ఉత్సవాలు, దుర్గా పూజలో బాలీవుడ్ హీరోయిన్లు ఉత్సాహంగా పాల్గొనడం ఆనవాయితీ. ముఖ్యంగా కాజోల్ , రాణి ముఖర్జీ ఈ కార్యక్రమాల్లో ముందంజలో ఉంటూ బంధుజనంతో కలివిడిగా తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కానీ ఏడాది ఉత్సవాల్లో వారిద్దరూ తీవ్ర భావోద్వాగానికి లోనయ్యారు. అటు తన తండ్రి తరువాత అయాన్ ముఖర్జీ దుర్గా పూజ ఉత్సవాల్లో తొలిసారి పాల్గొన్నారు.
తమ సమీప బంధువు, అత్యంత ఆప్తుడైన నటుడు దేబ్ ముఖర్జీ ఈ ఏడాదితమ మధ్య లేకపోవడమే ఇందుకు కారణం. ఆయనను గుర్తు చేసుకుని ఆయన మేనకోడళ్ళు నటీమణులు కాజోల్ , తనీషా రాణీ ముఖర్జీ భావోద్వాగానికి లోనయ్యారు. ఈ దృశ్యలు ఆన్‌లైన్‌లో దర్శనిమిచ్చాయి. ప్రతి సంవత్సరం దుర్గా పూజ పండల్ ఘనంగా దేబ్ ముఖర్చీ ఈ ఏడాది లేరు. ప్రముఖ బాలీవుడ్ నటుడు చిత్రనిర్మాత,బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ తండ్రి దేబ్ ముఖర్జీ. ఫ్యామిలీ అంతా ప్రేమగా 'దేబు కాకా' అని పిల్చుకునే దేబ్ ముఖర్జీ మార్చి 14, 2025న కన్నుమూసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది తమ కుటుంబ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లి, ఉత్సవాలను కలిసి ప్రారంభించారు కాజోల్, రాణీ ముఖర్జీ తనీషా ముఖర్జీ తదితర కుటుంబ సభ్యులు నార్త్ బాంబే సర్బోజానిన్ దుర్గా పూజ పండల్‌ను ఆవిష్కరించారు.రాణి ముఖర్జీ కుటుంబం యొక్క దుర్గా పూజ 2025 కి సహ-నిర్వాహకురాలిగా ఉన్నారు.

‘‘అయిగిరి నందిని’’అనే స్తోత్రం మధ్య కాజోల్, రాణి దుర్గా మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అమ్మవారిని చూడగానే ఇద్దరూ భక్తితో చేతులో జోడించి నమస్కరించారు. అనంతర అటు అమ్మవారి రూపాన్ని చూసి, ఇటు దివంగత దేబ్ ముఖర్జీని స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
VIDEO | Mumbai, Maharashtra: Actors Kajol and Rani Mukherjee witness the unveiling of the Goddess' idol at the North Bombay Sarbojanin Durga Puja Samiti.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/EgP2o1xVOH— Press Trust of India (@PTI_News) September 27, 2025
ఈ సందర్భంగా తనీషా మాట్లాడుతూ"మా కుటుంబానికి ఇది కొంచెం విచారకరమైన సమయం, కొంచెం ఉత్సాహంతో పాటు, ఈ సంవత్సరం మా కుటుంబంలో ముగ్గురు ఆప్తులను కోల్పోయాం. ప్రతి సంవత్సరం దుర్గా పూజను నిర్వహించే మా దేబు కాకా (దేబ్ ముఖర్జీ) ఇక లేరు, ఈసారి పూజకు హాజరు కావడం కొంచెం కష్టంగానే అనిపించింది. అయినా గానీ ఆయన కలను ముందుకు తీసుకెళ్తున్నందున చాలా ఆనందంగా కూడా ఉంది." అన్నారు.