‘మిమ్మల్ని ప్రాంక్‌ చేశాను బ్రో’

Sharing Kajol Number On Twitter Ajay Devgan Said He Just Pranked - Sakshi

‘ఇదంతా ప్రాంక్‌ బ్రదర్‌.. సినిమాల్లో చూసి చూసి బోర్‌ కొట్టింది. అందుకే మిమ్మల్ని ప్రాంక్‌ చేద్దామని ఇలా చేశానంటు’న్నారు హీరో అజయ్‌ దేవగణ్‌. ఏప్రిల్‌ 1 ఫూల్స్‌ డే ఉన్నా కూడా ఈ మధ్య టీవీల్లో వచ్చే తలాతోకాలేని కార్యక్రమాల పుణ్యానా ఈ ప్రాంక్‌ కాల్స్‌ పిచ్చి అందరికి బాగానే ఎక్కేసింది. తాను కూడా అలానే చేశానంటున్నారు అజయ్‌ దేవగణ్‌. నిన్న మధ్యాహ్నం అజయ్‌  ‘కాజోల్‌ ప్రస్తుతం ఇక్కడ(భారత్‌) లేరు. 98******** తన వాట్సాప్‌ నంబర్‌ ఇది. ఈ నెంబర్‌ ద్వారా ఆమెను సంప్రదించగలరు’  అంటూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. దాంతో అభిమానులు కాజల్‌తో మాట్లాడవచ్చనే ఆనందంలో ఆమెకు మెసేజ్‌లు పెట్టి రిప్లై కోసం ఎదురు చూశారు. అంతేకాక ‘రిప్లై కోసం ఎదురు చూస్తున్నాం సార్‌’ అంటూ స్ర్కీన్‌షాట్లు తీసి అజయ్‌కు పంపించారు.

ఇలా నెటిజన్లతో కాసేపు ఆడుకున్న అజయ్‌ దేవగణ్‌ ఆ తర్వాత అసలు విషయం చెప్పారు. ‘సినిమాల్లో ప్రాంక్‌(ఫూల్స్‌) చేసి చేసి బోర్‌ కొట్టింది. అందుకే వెరైటీగా మిమ్మల్ని ప్రాంక్‌ చెద్దామని భావించి ఇలా చేశానం’టూ ట్వీట్‌ చేశారు. దాంతో పాటు అభిమానులు నుంచి తనకు వచ్చిన రీట్వీట్స్‌ని కూడా పోస్ట్‌ చేశారు. దాంతో అజయ్‌ షేర్‌ చేసిన నంబర్‌ ఫేక్‌ అని తేలిపోయింది. ఇండస్ట్రీలో ఇలాంటి చిలిపి పనులు చేయడంలో అజయ్‌ దేవగణ్‌ ముందుంటారనే పేరుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top