Adipurush Actress Kriti Sanon Debut As Producer With Blue Butterfly Films - Sakshi
Sakshi News home page

కృతి సనన్‌ న్యూ అవతార్‌: థ్రిల్లింగ్‌ గేమ్‌తో ఎంట్రీ ఇచ్చేసింది!

Jul 5 2023 3:54 PM | Updated on Jul 5 2023 5:10 PM

Do Patti adipurush actress Kriti Sanon debuts as producer Details Here - Sakshi

'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్‌ సరసన సీతగా కనిపించిన నటి కృతి సనన్ బిజినెస్‌ విమెన్‌గా కొత్త అవతారమెత్తింది. త్వరలోనే ప్రొడ్యూసర్‌గా మారనుందంటూ సోషల్ మీడియాలో వార్తలను నిజం చేస్తూ తన ప్రాజెక్ట్‌ వివరాలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.  తన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పేరును బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ గా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్‌ సందడి మొదలైంది. (డోర్లు, టైర్లు లేని కారు, షాకవుతున్న నెటిజన్లు: వీడియో చూడండి!)

నిర్మాతగా అడుగుపెట్టిన కృతి సనన్‌ నిర్మాణ సంస్థ బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్‌ను  సోషల్‌ మీడియాలో ఆవిష్కరించింది. అలాగే నిర్మాతగా తన తొలి ప్రాజెక్ట్ ‘దో పట్టి’ అని  ప్రకటించింది. ఇందుకోసం ముగ్గరు స్ట్రాంగ్‌, స్ఫూర్తిదాయకమైన, అపారమైన ప్రతిభావంతులైన మహిళలతో జత కట్టినట్టు వెల్లడించింది కృతి. ప్రొడక్షన్ హౌస్ లోగో రీల్‌తోపాటు, బాలీవుడ్‌ నటి కాజోల్‌, స్క్రీన్ ప్లే రైటర్ కనికా ధిల్లాన్, రిచిక కపూర్‌తో ఉన్న పిక్‌ను షేర్‌ చేసింది. 

‘దో పట్టి’ మిస్టరీ థ్రిల్లర్‌గా రాబోతోందట. అంతేకాదు  కృతి ఎనిమిదేళ్ల విరామం తర్వాత దిల్‌వాలేలో, రోహిత్ శెట్టి, కాజోల్‌తో తిరిగి కలుస్తున్నట్టు కూడా పేర్కొంది. కృతి నిర్మాణ రంగంలోకి ప్రవేశించడమే కాకుండా రచయిత్రి కనికా ధిల్లాన్‌కి తొలి వెంచర్‌గా నెటిఫ్లిక్స్‌ను ఎంచుకున్నట్టు తెలిపింది. (అంబానీ ‘రంగులు మార్చే’ లగ్జరీ కారు: వీడియో వైరల్‌

9 సంవత్సరాల డ్రీమ్‌ సాకారంలో బేబీ స్టెప్స్ వేసాను, నేర్చుకున్నాను, యాక్టర్‌గా ఎదిగాను! ఫిల్మ్ మేకింగ్‌లోని ప్రతి బిట్‌ను, ప్రతీ అంశాన్ని లైక్‌ చేశా.. ఇపుడు నా కిష్టమైన, నచ్చిన ఆశాజనకంగా ఉండే మరిన్ని కథలను చెప్పడానికి,మరింత తెలుసుకోవడానికి సమయం ఆసన్నమైంది.ఈ మ్యాజికల్ జర్నీని ప్రారంభించేందుకు రడీగా ఉన్నానంటూ తన సోదరి నూపర్‌ సనన్‌కి ట్యాగ్‌ చేస్తూ నిండు హృదయంతో, బిగ్‌ డ్రీంకి స్వాగతం అంటూ  పోస్ట్‌ పెట్టింది. దీంతో ఫ్యాన్స్‌తో పాటు, పలువురు సినీ ప్రముఖులు అభినందనలు కురిపించారు. వరుణ్ ధావన్, హ్యూమా ఖురేషి, శోభితా ధూళిపాళ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కృతికి కంగ్రాట్స్  చెప్పారు.

కాగా  కృతి సనన్ టైగర్ ష్రాఫ్‌తో కలిసి సబ్బీర్ ఖాన్ హీరోపంతి (2014)లో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది.బరేలీ కి బర్ఫీ, మిమీ వంటి మూవీల్లోని నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  అప్‌కమింగ్‌మూవీస్‌ విషయానికి వస్తే టబు , కరీనా కపూర్‌లతో కలిసి ‘ది క్రూ’,  టైగర్ ష్రాఫ్‌తో కలిసి  ‘గణపతి పార్ట్-1 లో నటిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement