భవానీలో భిన్న కోణాలుంటాయి | Keerthy Suresh akka web series Traler Launch | Sakshi
Sakshi News home page

భవానీలో భిన్న కోణాలుంటాయి

Oct 25 2026 6:11 AM | Updated on Oct 25 2026 6:11 AM

Keerthy Suresh akka web series Traler Launch

– కీర్తీ సురేష్‌

కీర్తీ సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘అక్క’. ధర్మరాజ్‌ శెట్టి దర్శకత్వంలో వైఆర్‌ఎఫ్‌ ఎంటర్‌టైన్ మెంట్‌ నిర్మించిన ఈ సిరీస్‌ ఈ నెల 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో భవాని పాత్రలో కీర్తీ సురేష్, రుద్రగా రాధికా ఆప్టే నటించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. అధికారం, వారసత్వం, ప్రతీకారం వంటి అంశాల నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌æసిరీస్‌గా ‘అక్క’ ఉంటుందని ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది. 

ఈ సందర్భంగా కీర్తీ సురేష్‌ మాట్లాడుతూ–‘‘భవాని, రుద్ర... ఇద్దరూ పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వారు. వీరి మధ్య ఉండే సంబంధం కథలో ఉత్కంఠను మరింత పెంచుతుంది. తన నమ్మకాలు, విలువలు ఏంటో స్పష్టంగా తెలిసిన మహిళ భవాని. ఆమె తీసుకునే నిర్ణయాలు అంత సులువైనవి కావు. తన వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లడానికి ఆమె సిద్ధంగా ఉంటుంది. కథ ముందుకు సాVó  కొద్దీ భవానీలోని విభిన్న కోణాలను ప్రేక్షకులు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement