డోర్లు, టైర్లు లేని కారు, షాకవుతున్న నెటిజన్లు: వీడియో చూడండి! | Sakshi
Sakshi News home page

డోర్లు, టైర్లు లేని కారు, షాకవుతున్న నెటిజన్లు: వీడియో చూడండి!

Published Wed, Jul 5 2023 3:11 PM

Netizens astonished by worldlowest car without tyres and doors watch - Sakshi

సాధారణంగా కారు కొనాలనుకున్న వారు సేఫ్టీ ఫీచర్లు, మైలేజీ, ధర లాంటి వివరాలను పరిశీలించి తమకిష్టమైనకారును సొంతం చేసుకుంటారు.  కానీ డోర్లు, టైర్లు లేని  కారును  ఎక్కడైనా  చూశారా? ప్రపంచంలోనే అతి చిన్నకారుగా పిలుస్తున్న ఈ కారుకు సంబంధించిన  వీడియో వైరల్  అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ,  దానుకనుగుణంగా కొత్త ఫీచర్లు, డిజైన్‌లతో స్టైలిష్ కార్లతోపాటు, బడ్జెట్‌ కార్లపై కార్‌మేకర్లు దృష్టిపెడుతున్న క్రమంలో ఈ బుల్లి కారు సోషల్‌ మీడియా యూజర్లను భలే ఆకట్టుకుంటోంది. 37 మిలియన్ల  వ్యూస్‌తో,  లైక్స్‌, రీట్వీట్స్‌తో దూసుకుపోతోంది. బహుశా ఇది మిస్టర్ బీన్ కోసం మిస్టర్ బీన్ కనిపెట్టాడేమో అంటూ  ఒకరు కమెంట్‌ చేశారు. అలాగే నమ్మశక్యం కాని డిజైన్ వెనుక ఉన్న సృజనాత్మకతను అభినందిస్తున్నారు.

"మాస్సిమో"  ట్విటర్‌ ​ ఖాతాలో  గత నెల 26న ఈ వీడియోను షేర్ చేసింది. వైరల్ వీడియోలో, సియాన్ కలర్కారును చూస్తే, టైర్లు లేదా తలుపులు లేవు. దీంతో  నిజంగా ఇదే  కారేనా అన్న అనుమానం కూడా కలుగకమానదు.వాస్తవానికి, ఈ వీడియోను యూట్యూబ్ ఛానెల్ కారమాఘెడన్ పోస్ట్ చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement