భౌతికశాస్త్ర నియమాలకు సవాలు.. మస్క్ ఫైటర్ జెట్ | Elon Musk Ufo Fighter Jet | Sakshi
Sakshi News home page

భౌతికశాస్త్ర నియమాలకు సవాలు.. మస్క్ ఫైటర్ జెట్

Aug 1 2025 8:09 PM | Updated on Aug 1 2025 8:20 PM

Elon Musk Ufo Fighter Jet

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత 'ఎలాన్ మస్క్' టెక్నాలజీలో సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ.. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూనే ఉంటారు. ఇందులో భాగంగానే భౌతిక శాస్త్ర నియమాలనే సవాలు చేసే ఒక కొత్త యుద్ధ విమానాన్ని ఆవిష్కరించారు. దీని పేరు 'యూఎఫ్ఓ ఫైటర్' (UFO Fighter).

ఎలాన్ మస్క్ ఆవిష్కరించిన యుద్ధ విమానం యూఎఫ్ఓ ఫైటర్.. ఇప్పటి వరకు ఉన్న అన్ని విమానాలకంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఈ జెట్ చాలా వేగంగా ప్రయాణించగలదు. అంతే కాకుండా.. అసాధ్యమైన విన్యాసాలు చేయగలదని, ఆకాశంలో నిశ్శబ్దంగా పనిచేయగలదని మస్క్ వెల్లడించారు.

ఇదీ చదవండి: మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులు

మస్క్ ఆవిష్కరించిన కొత్త యూఎఫ్ఓ ఫైటర్.. ఎంతోమంది నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. కొందరు ఈ ఫైటర్ జెట్ మీద కొంత సందేహాస్పదంగానే ఉన్నారు. ఇది టెక్నాలజీనా? లేక దార్శనిక భావననా? అని అనుకుంటున్నారు. అయితే మస్క్ కొత్త ఆవిష్కరణ ఓ సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది. లేటెస్ట్ ఏరోస్పేస్ టెక్నాలజీ మానవాళి భవిష్యత్తుకు దోహదపడుతుందని పలువురు చెబుతున్నారు. అయితే మస్క్ యూఎఫ్ఓ ఫైటర్ గురించి చాలా విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement