మనోడి లక్‌ బాగుంది.. లేకుంటే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసేది..!

Viral: Truck Driver Narrowly Escaped From Crushing Between Car And Lorry Brazil - Sakshi

ప్రమాదాలనేవి ఎప్పుడు, ఏ రకంగా వస్తాయో ఎవరూ ఊహించలేం. అవి ఎదురైనప్పుడు కొందరు లక్కీగా తప్పించుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ ట్రక్‌ డ్రైవర్‌ అదృష్టం బాగుండడంతో తన ట్రక్‌ కారణంగా ప్రాణాలు పోకుండా తప్పించుకున్నాడు. అయినా, పాపం తన ట్రక్‌ మీద తెచ్చిన కారుతో ముప్పతిప్పలు పడ్డాడు. ఈ ఘటన బ్రెజిల్‌, సావోపాలోలోని చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..  క్యాంపినాస్‌కు చెందిన ఓ డ్రైవర్‌ తన ట్రక్‌పై నల్ల కారును తీసుకెళుతున్నాడు. అతను వెళ్తున్న దారిలో ఓ చోట ఎత్తుగా ఉండడంతో పాటు రోడ్డు మలుపు తిరుగుతుండడంతో ట్రక్‌ మీద ఉన్న కారు సడన్‌గా కిందపడి వెనుక్క వెళ్లింది. అది గమనించిన ఆ వ్యక్తి ట్రక్‌లోంచి కిందకు దూకి కారు వెంట పరిగెత్తాడు. కారు చివరకు ఓ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. హమ్మయ్యా అనుకున్న డ్రైవర్‌ ట్రక్‌ను తీసుకువచ్చి కారుకు కొద్దిదూరంలో ఆపాడు. కారు టెన్షన్‌లో ట్రక్‌కు హ్యాండ్‌ బ్రేక్‌ వేయటం ఆ వ్యక్తి మర్చిపోయాడు. ఈ క్రమంలో అతడు ట్రక్‌ నుంచి కిందకు దిగి కారు దగ్గరకు వస్తుండగా.. ట్రక్‌ కిందకు దొర్లసాగింది.

అతడు దాన్ని ఆపే ప్రయత్నం చేసినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. అది ఏకంగా దొర్లుకుంటూ కారును ఢీకొట్టింది. అయితే, ట్రక్‌కు, కారుకు మధ్య ఉన్న ఆ ట్రక్‌ డ్రైవర్‌ కాస్త ఉంటే ఆ రెండింటి మధ్య నలిగిపోయేవాడే. పక్కకు జరగటంతో పెనుప్రమాదం తప్పింది. ట్రక్‌ కారును ఢీకొట్టి వెనక్కు వెళ్లి​ ఇంటిని ఢీకొట్టి ఆగిపోయింది. ఈనెల 11న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: చిప్స్‌ ప్యాకెట్‌లో అది చూసి షాక్‌ అయిన కస్టమర్‌..!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top