నటులు ఎక్కువగా చెప్పే అబద్దం ఇదేనంటా

Ajay Devgn Said I Love My Wife Is The Lie That Every Actor From The Film Industry - Sakshi

బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహిరించే ‘కాఫీ విత్‌ కరణ్‌ జోహార్’ కార్యక్రమం ఎంత పాపులరో తెలిసిన సంగతే. ప్రస్తుతం కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 6 నడుస్తోంది. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఈ ఆదివారం జాన్వీ కపూర్‌, అర్జున్‌ కపూర్‌లు పాల్గొనగా వచ్చే ఆదివారం ఈ షోకి బాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్‌ కాజోల్‌ - అజయ్‌ దేవగణ్‌లు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రోమోల్లో అజయ్‌ తన భార్య కాజోల్‌ను తెగ ట్రోల్‌ చేస్తున్నారు. కాజోల్‌ ఫోటోలు దిగడానికి 1 సెకను పడుతుంది. కానీ వాటిని పోస్ట్‌ చేయడానికి మాత్రం 3 - 4 గంటల సమయం పడుతుందన్నారు అజయ్‌.

యాక్టర్లు తరచుగా చెప్పే అబద్దం ఏంటని ప్రశ్నించగా ‘నా భార్యను ప్రేమిస్తున్నాను’ అని అజయ్‌ సమాధానం చెప్పడం.. వెంటనే ‘నేను కాదు మిగతా వారు’ అంటూ కవర్‌ చేసుకోవడం సరదాగా ఉంది. చివరకూ ‘మీ పెళ్లి రోజు ఎప్పుడ’ని అడగ్గా.. అజయ్‌ తడబటడం.. ఆఖరికి తప్పు సమాధానం చెప్పడం వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ ప్రోమోలను మీరు కూడా చూడండి.

కాజోల్‌ - కరణ్‌ జోహార్‌ ఇద్దరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌. అయితే 2016లో అజయ్‌, కరణ్‌ జోహార్‌ సినిమాల విడుదల సమయంలో వచ్చిన వివాదం కారణంగా కాజోల్, కరణ్‌ కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత కరణ్‌ జోహార్‌కు కవల పిల్లలు రూహి, యాష్‌లు పుట్టిన తరువాత వీరిద్దరి మధ్య మాటలు ప్రారంభమయ్యాయి. బెస్ట్‌ఫ్రెండ్స్‌ ఇద్దరూ తెర మీద కనిపిస్తోంది ఈ ప్రోగ్రాం ద్వారానే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top