అజయ్ దేవగన్ నివాసంలో అనంత్ అంబానీ - వీడియో | Anant Ambani In Ajay Devgan Bungalow Viral Video | Sakshi
Sakshi News home page

అజయ్ దేవగన్ నివాసంలో అనంత్ అంబానీ - వీడియో

Jun 25 2024 3:54 PM | Updated on Jun 25 2024 4:32 PM

Anant Ambani In Ajay Devgan Bungalow Viral Video

అనంత్ అంబానీ వచ్చే నెలలో రాధికా మర్చంట్‌ను వివాహం చేసుకోనున్నారు. వివాహ సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తమ పెళ్ళికి ఆహ్వానించడానికి అనంత్ అంబానీ స్వయంగా అజయ్ దేవగన్, కాజోల్ నివాసానికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అనంత్ అంబానీ.. అజయ్ దేవగన్ ఇంటి నుంచి బయటకు వచ్చి తన రోల్స్ రాయిస్ కారులోకి వెళ్లడం చూడవచ్చు. ఆ తరువాత తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఇదిలా ఉండగా అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లి కార్డును దేవుని చెంత ఉంచడానికి, దేవుని ఆశీర్వాదం పొందటానికి అక్కడకు వెళ్లినట్లు నీతా అంబానీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జూలై 12న పెళ్లి
2024 జులై 12న వీరి పెళ్లి జరుగుతుందని ఇప్పటికే వారిరువురి కుటుంబాలు పేర్కొన్నాయి. అనంత్ & రాధికల పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజులు జరగనుంది. జులై 12న వివాహం, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ ఉత్సవ్ లేదా రిసెప్షన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్ళికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.

ముకేశ్ & నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీతో సహా పలు రిలయన్స్ గ్రూప్ కంపెనీల బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement