కాజోల్‌ హారర్‌ మూవీ.. వెన్నులో వణుకు పుట్టించేలా ట్రైలర్‌! | Bollywood Actress Kajol Latest Movie Maa Trailer Out Now | Sakshi
Sakshi News home page

Maa Trailer: కాజోల్‌ హారర్ థ్రిల్లర్‌.. భయపెడుతోన్న ట్రైలర్!

May 29 2025 3:48 PM | Updated on May 29 2025 4:17 PM

Bollywood Actress Kajol Latest Movie Maa Trailer Out Now

బాలీవుడ్ భామ కాజోల్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం‌ మా(Maa Movie). ఈ సినిమాకు విశాల్ రేవంతి ఫూరియా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై అజయ్ దేవగన్, జ్యోతి శాంతా సుబ్బరాయన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ట్రైలర్ చూస్తే ఈ మూవీ హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో దెయ్యం సీన్స్‌ ఆడియన్స్‌కు వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నయి. ట్రైలర్‌ ఆద్యంతం ఆడియన్స్‌లో అత్యంత ఉత్కంఠ పెంచేలా ఉంది. దెయ్యం బారిన పడిన తన కుమార్తెను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన యుద్ధమే ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో తనూజ దేవ్‌గణ్‌, రోనిత్‌రాయ్‌, సుభద్ర సేన్‌గుప్త, ఇంద్రనీల్, జితిన్ జ్యోతి గులాటీ  పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement