
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ను బాడీ షేమింగ్ చేయడాన్ని మరో నటి, టీవీ హోస్ట్ మిని మాథుర్ తప్పుపట్టింది. ఓ నెటిజన్ ఇన్స్టాగ్రామ్లో కాజోల్ వీడియోను పోస్ట్ చేయడంపై మండిపడింది. అసలు ఆమె బాడీని జూమ్ చేయడానికి నీకెంత ధైర్యం..తాను ఎలా కనిపించాలనేది తన ఇష్టమని.. మీరేలా డిసైడ్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాజోల్ వీడియోను జూమ్ చేస్తూ పోస్ట్ చేసిన వీడియోపై మిని మాథుర్ ఈ విధంగా స్పందించింది.
కాగా.. బాలీవుడ్ నటి కాజోల్ తన లేటేస్ట్ వెబ్ సిరీస్ ది ట్రయల్ రెండో సీజన్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు, ఇందులో ఆమె నోయోనికా సేన్‌గుప్తా అనే లాయర్ పాత్రను పోషించారు. ముంబై జరిగిన ఈ ఈవెంట్‌లో కాజోల్ బ్లాక్ స్కర్ట్ డ్రెస్లో కనిపించింది. దీంతో వెంటనే డ్రెస్పై నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఇది చూసిన నటి మిని మాథుర్ అలాంటి వారికి ఇచ్చిపడేసింది. అయితే తనపై వచ్చిన బాడీ-షేమింగ్ వ్యాఖ్యలపై కాజోల్ ఇంకా స్పందించలేదు.

మరోవైపు ది ట్రయల్ వెబ్ సిరీస్కు మొదటి సీజన్కు ప్రశంసలు వచ్చాయి. ఈ సిరీస్లో మరోసారి కాజోల్ న్యాయవాది నోయోనికా సేన్‌గుప్తాగా అలరించనుంది. ఈ చిత్రంలో జిషు సేన్‌గుప్తా ఆమె భర్తగా కనిపించనున్నారు. ఈ సిరీస్ మొదటి సీజన్ 2023లో విడుదలైంది. ఇందులో సోనాలి కులకర్ణి, షీబా చద్దా, అలీ ఖాన్, కుబ్రా సైట్, గౌరవ్ పాండే, కరణ్‌వీర్ శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ సీజన్ సెప్టెంబర్ 19, 2025న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.