శ్రీదేవి ఒక యాక్టింగ్‌ స్కూల్‌ | Kajol Writes Foreword Of Book On Sridevi Life | Sakshi
Sakshi News home page

శ్రీదేవి ఒక యాక్టింగ్‌ స్కూల్‌

Sep 27 2019 1:09 AM | Updated on Sep 27 2019 1:09 AM

Kajol Writes Foreword Of Book On Sridevi Life - Sakshi

‘‘శ్రీదేవి స్టార్‌డమ్‌ని, తన మ్యాజిక్‌ని సిల్వర్‌ స్క్రీన్‌ మీద చూస్తూనే పెరిగాను. శ్రీదేవి ఒక యాక్టింగ్‌ స్కూల్‌. ఎప్పటికీ నా ఫేవరెట్‌ ఐకాన్‌’’ అని శ్రీదేవి మీద తనకున్న అభిమానాన్ని  చెప్పుకొచ్చారు కాజోల్‌. చెప్పడమే కాదు శ్రీదేవి మీద రాబోతున్న ‘శ్రీదేవి : ద ఎటర్నల్‌ స్క్రీన్‌ గాడెస్‌’ పుస్తకానికి కాజోల్‌ ముందు మాట కూడా రాశారు. శ్రీదేవి జీవితాన్ని ఓ పుస్తకంగా మలిచారు రచయిత సత్యర్థ్‌. పెంగ్విన్‌ బుక్స్‌ సంస్థ ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకు రానుంది.

శ్రీదేవి సౌత్‌లో హీరోయిన్‌గా స్టార్ట్‌ అయి బాలీవుడ్‌లో నెం. 1గా ఎలా ఎదిగారు? ఆమె ప్రయాణం, కుటుంబం ఇలా అన్ని విషయాలను ఆ పుస్తకంలో పొందుపరిచారు.  ‘‘స్టార్‌ నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన  శ్రీదేవి ప్రయాణాన్ని ఇండస్ట్రీ కిడ్‌గా కాజోల్‌ గమనించారు. అదంతా ముందు మాటలో అద్భుతంగా రాసుకొచ్చారు. తనకి స్ఫూర్తిని ఇచ్చిన నటికి ప్రేమతో రాసిన లేఖలా ఈ ముందు మాట ఉంది’’ అని పుస్తక రచయిత సత్యర్థ్‌ తెలిపారు. ‘‘ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ థ్యాంక్స్‌. ఈ అవకాశం రావడం గౌరవంగా ఉంది. ముందు మాట రాయడం ద్వారా తొలి లేడీ సూపర్‌స్టార్‌కు నా వంతు నివాళి అందించానని అనుకుంటున్నాను’’ అన్నారు కాజోల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement