భార్య నంబర్‌ షేర్‌ చేసిన హీరో!! | Ajay Devgn Accidentally Shares Kajol WhatsApp Number On Twitter | Sakshi
Sakshi News home page

Sep 24 2018 8:32 PM | Updated on Sep 24 2018 8:37 PM

Ajay Devgn Accidentally Shares Kajol  WhatsApp Number On Twitter - Sakshi

‘కాజోల్‌ ప్రస్తుతం ఇక్కడ(భారత్‌)లో లేరు. 98********’

పొరపాటున భార్య కాజోల్‌నంబర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌. ‘కాజోల్‌ ప్రస్తుతం ఇక్కడ(భారత్‌)లో లేరు. 98******** తన వాట్సాప్‌ నంబర్‌ ఇది. ఈ నెంబర్‌ ద్వారా ఆమెను సంప్రదించగలరు’  అంటూ అజయ్‌ ట్వీట్‌ చేశారు. అంతే ఇంకేముంది కొద్ది సెకన్ల వ్యవధిలోనే అజయ్‌ ట్వీట్‌ వైరల్‌గా మారింది. రీట్వీట్లు, లైకులతో ట్రెండింగ్‌లోకి వెళ్లింది.

జాగ్రత్త..!
కాజోల్‌ నంబరును సేవ్‌ చేసుకున్న నెటిజన్లు ఆమెకు మెసేజ్‌ పెట్టి మరీ.. ‘రిప్లై కోసం ఎదురుచూస్తున్నాం సార్‌’  అంటూ స్క్రీన్‌షాట్లతో సహా అజయ్‌ని ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. మరికొం‍త మంది మాత్రం.. ‘సార్‌.. కాజోల్‌ మేడమ్‌ నంబరు సోషల్‌ మీడియాలో ఎలా పెడతారు. వాట్సాప్‌ అనుకొని ట్విటర్‌లో షేర్‌ చేసినట్టున్నారు. కాస్త జాగ్రత్త’ అంటూ హితవు పలికారు. అయితే అజయ్‌ ట్విటర్‌ హ్యాక్‌ అయిందేమో అంటూ మరికొందరు అతడికి సపోర్టు చేశారు. కాగా కాజోల్‌ ప్రస్తుతం తన అప్‌కమింగ్‌ మూవీ ‘హెలికాప్టర్‌ ఈల’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement