అజయ్ దేవగణ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ దృశ్యం-3. గతంలో రెండు పార్టులు సూపర్ హిట్ కావడంతో దృశ్యం 3: ది కంక్లూజన్ పేరుతో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ మూవీ కలెక్షన్స్ పరంగా ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 480 కోట్ల మార్కును దాటేసింది.
తాజాగా ఈ సినిమా మరో ఘనత సాధించింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా ఘనత సొంతం చేసుకుంది. ఈ జాబితాలో మొదటిస్థానంలో దురంధర్-2 కొనసాగుతోంది. ఇదే క్రమంలో హనుమాన్ అన్ష్(రూ.431 కోట్లు), బోర్డర్ -2 (రూ.464 కోట్లు) చిత్రాలను అధిగమించింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.480.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా.. దేశవ్యాప్తంగా రూ.371.40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. కాగా.. ఈ చిత్రంలో జైదీప్ అహ్లావత్, శ్రియా సరన్, ఇషితా దత్తా, టబు, రజత్ కపూర్, ప్రకాష్ రాజ్, మృణాల్ జాదవ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది.


