కృతి సనన్‌, కాజోల్‌ 'దో పత్తి' ట్రైలర్‌ చూశారా..? | Kajol And Kriti Sanon 'Do Patti' Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

కృతి సనన్‌, కాజోల్‌ 'దో పత్తి' ట్రైలర్‌ చూశారా..?

Oct 14 2024 3:45 PM | Updated on Oct 14 2024 4:01 PM

Kajol And Kriti Sanon 'Do Patti' Movie Trailer Out Now

బాలీవుడ్‌ హీరోయిన్‌  కృతి సనన్‌, కాజోల్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా  ‘దో పత్తి’. కృతి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం  డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. కృతి సనన్‌ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటింది. అయితే, ఇప్పటి వరకు నటిగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న ఆమె తొలిసారి ఈ చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించింది.

అక్టోబర్‌ 25 నుంచి   ‘దో పత్తి’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారికంగా మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. మిస్టరీ థ్రిల్లర్‌ కథతో రానున్న ఈ చిత్రంలో కాజోల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 2015లో దిల్‌వాలే సినిమాలో కృతి సనన్‌, కాజోల్‌ ఇద్దరూ కలిసి తొలిసారి నటించారు. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ 'దో పత్తి' సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement