నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్‌ వార్నింగ్‌ | Kajol Warns Trolls who Targets Her Daughter Nysa Devgan | Sakshi
Sakshi News home page

Kajol: నా కూతురి జోలికొస్తే.. కారును మీ శరీరాలపై నుంచి పోనిస్తా..

Jun 21 2025 1:39 PM | Updated on Jun 22 2025 1:40 PM

Kajol Warns Trolls who Targets Her Daughter Nysa Devgan

నా జోలికొస్తే ఊరుకుంటానేమో కానీ నా కూతురి జోలికొస్తే మాత్రం అంతు చూస్తానంటోంది హీరోయిన్‌ కాజోల్‌ (Kajol). ప్రస్తుతం ఆమె మా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ మూవీ జూన్‌ 27న విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజోల్‌.. తన కూతురిని ట్రోల్‌ చేసేవారికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా.. నా కూతుర్ని విమర్శించేవాళ్లెవరూ నా కారు ముందుకు రావొద్దు. 

నా కారు ముందుకొచ్చారంటే..
ఒకవేళ వచ్చారే అనుకోండి.. నా కారుతో మిమ్మల్ని ఢీ కొట్టి మీ శరీరాలపై నుంచే నా కారును పోనిస్తాను. సోషల్‌ మీడియాలో వెయ్యి మెసేజ్లు వస్తే అందులో 999 తను అందంగా ఉంది, మీరు అమేజింగ్‌.. ఇటువంటి కామెంట్లే ఉంటాయి. కానీ ఏదో ఒక్కటి మాత్రం బ్యాడ్‌ కామెంట్‌ ఉంటుంది. అలా చెత్త వాగుడు వాగేవారు ఎందుకున్నారో అర్థం కాదు. అయినా నేను మంచి గురించే ఎక్కువగా పట్టించుకుంటాను. చెడు గురించి కాదు అని చెప్పుకొచ్చింది.

హారర్‌ సినిమా
హారర్‌ సినిమాలను మ్యూట్‌లో పెట్టుకునే చూసే కాజోల్‌.. తొలిసారి ఈ జానర్‌లో నటిస్తోంది. విశాల్‌ ఫ్యురియా దర్శకత్వం వహిస్తున్న మా చిత్రంలో రోనిత్‌ రాయ్‌, ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, కెరిన్‌ శర్మ, నితిన్‌, సూర్‌జ్యశిఖ దాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాజోల్‌ చివరగా క్రూ సినిమాలో నటించింది. కాజోల్‌, బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌.. 1999లో పెళ్లి చేసుకున్నారు. 2003లో వీరికి కూతురు నైసా జన్మించింది. 2010లో కుమారుడు యుగ్‌ పుట్టాడు.

చదవండి: ఎయిరిండియాకు నటుడి సపోర్ట్‌.. ఫ్రీ టికెట్‌ ఇచ్చారా?

Advertisement
 
Advertisement
Advertisement