పాత ట్యూన్‌కి కొత్త స్టెప్స్‌

Ajay Devgn's 1994 Ruk Ruk song will be recreated for the Kajol-starrer - Sakshi

తొంభైలలో అజయ్‌ దేవగన్, టబు పాడుకున్న ‘రుక్‌ రుక్‌...’ పాటను లేటెస్ట్‌గా రీమిక్స్‌ చేశారు ‘హెలికాఫ్టర్‌ ఈల’ చిత్రబృందం. కాజోల్‌ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘హెలీకాఫ్టర్‌ ఈల’. గాయని కావాలనుకునే తల్లి పాత్రలో కాజోల్‌ కనిపించనున్నారు. ఈ సినిమా కోసం  అజయ్‌ దేవగన్, టబు నటించిన ‘విజయ్‌పథ్‌ ’ సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌  ‘రుక్‌ రుక్‌..’ను రీమిక్స్‌  చేశారు.

ఈ పాత ట్యూన్‌కు కొత్త స్టెప్స్‌ జోడించారట కాజోల్‌. ఈ సాంగ్‌ హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. అజయ్‌ దేవగన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ఆయన పాటకే ఆయన శ్రీమతి కాజోల్‌ డ్యాన్స్‌ చేయడం విశేషం. ఈ సినిమాను అజయ్‌ దేవగన్, జయంతీలాల్‌ నిర్మించారు. అక్టోబర్‌ 12న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top