ధనుష్ నాకు అన్నలాంటోడు.. మృణాల్ ఇలా అనేసిందా? | Mrunal Thakur Reacts Dhanush Wedding Rumours Latest | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: పెళ్లిపై ఆగని రూమర్స్.. ఆ ట్వీట్ నిజమేనా?

Feb 2 2026 12:32 PM | Updated on Feb 2 2026 12:45 PM

Mrunal Thakur Reacts Dhanush Wedding Rumours Latest

స్వతహాగా బాలీవుడ్ నటి అయినప్పటికీ.. 'సీతారామం' సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకుర్. ఈమె మంచి యాక్టరే. కానీ రీసెంట్ టైంలో హీరో ధనుష్‌ని ఈమె పెళ్లి చేసుకోనుందనే రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై మృణాల్ టీమ్ కూడా కొన్నిరోజుల క్రితం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈమె కూడా ఈ విషయమై స్పందించినట్లు ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందంటే?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)

'నా పని మాత్రమే నాకు గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటాను. గాసిప్స్ కాదు. కానీ ఇప్పుడు నా ప్రమేయం లేని కొన్నింటిలో నా పేరు వినిపిస్తోంది. 'సో కాల్డ్ పెళ్లి కాంట్రవర్సీ' సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ధనుష్ నాకు సోదరుడు లాంటోడు. మా మధ్య గౌరవం, ప్రొఫెషనలిజం మాత్రమే ఉన్నాయి. అంతకు మించి ఇంకేం లేవు. అసలు జనాలు.. ఓ అమ్మాయి వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు పుకార్లు సృష్టిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇన్నాళ్లు ఏం మాట్లాడలేదు అంటే ఏదో దాచిపెడుతున్నానట్లు కాదు. నా వ్యక్తిగత జీవితం గురించి జనాలకు క్లారిటీ ఇవ్వాల్సిన పనిలేదని అర్థం. ఇన్నేళ్ల కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. రూమర్స్ ‌ దాన్ని తగ్గించాలని చూడొద్దు. లైక్స్, షేర్స్ వల్ల ఇబ్బంది ఏముంటుందిలే అనుకోవచ్చు. కానీ వాటి వల్ల జీవితాలపై గట్టి ప్రభావమే పడొచ్చు' అని మృణాల్ చెప్పినట్లు ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.

ట్విటర్ అకౌంట్ చూస్తే మృణాల్ ఠాకుర్‌దే అనుకుంటున్నారు గానీ అది ఫ్యాన్ పేజీలా అనిపిస్తుంది. బహుశా ఈమె టీమ్ వైపు నుంచి ఈ క్లారిఫికేషన్ వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. మృణాల్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ 'దో దివానే షెహర్ మైన్'.. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రానుంది. ఈమె నటించిన తెలుగు మూవీ 'డెకాయిట్'.. మార్చి 19న రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ)

Advertisement
 
Advertisement
Advertisement