సంచలన నటీమణుల్లో శ్రుతి హాసన్ ఒకరిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అంతే కాదు చాలా బోల్డ్ నటి కూడా. ప్రేమ, పెళ్లి విషయంలో చాలా స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేసే నటి.ప్రఖ్యాత నటుడు, సినీ వికీపీడియా కమలహాసన్ వారసురాలు అయిన శ్రుతి హాసన్ స్వతంత్ర భావాలు కలిగిన నటి. ఆ మధ్య ప్రేమించిన వ్యక్తిని తన తండ్రికి పరిచయం చేసిన గట్స్ ఉన్న నటి ఈ భామ.
హిందీ చిత్ర పరిశ్రమలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా సంగీత దర్శకులు,గాయని అంటూ పలు శాఖల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇటీవల ఈమె నటుడు రజనీకాంత్‌తో కలిసి కూలీ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
తమిళంలో విజయ్ సేతుపతి కి జంటగా నటించిన ట్రైన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల కథానాయకిగా బిజీగా లేకున్నా అభిమానులతో తరచూ సోషల్ మీడియా ఇంటరాక్టివ్ అవుతూ తమ భావాలను పెంచుకుంటూ వార్తల్లో ఉంటున్నారు. అలా తాజాగా అభిమానులతో ముచ్చటించారు. అందులో ఒకరు మీరు రిలేషన్ షిప్ లో ఉన్నారా అని అడగ్గా ‘‘ నేను రిలేషన్ షిప్ లో లేనని స్పష్టం చేశారు. అదేవిధంగా మీరు సినీ రంగంలో లేకుంటే ఏం చేసేవారు అన్న ప్రశ్నకు పిల్లల మనోతత్వ వైద్యురాలినన్నే దానిని పేర్కొన్నారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


