రాజకీయాల్లోకి తమిళ నటుడు విజయ్‌? | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి తమిళ నటుడు విజయ్‌?

Published Sat, Jan 27 2024 5:35 AM

Thalapathy Vijay To Launch Political Party Soon - Sakshi

చెన్నై: తమిళ నటుడు దళపతి విజయ్‌ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకుగాను త్వరలోనే కొత్తగా రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. చెన్నైలో గురువారం జరిగిన విజయ్‌ అభిమానుల సంఘం ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కమ్‌’సర్వసభ్య సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది.

విజయ్‌ అధ్యక్షతన ఏర్పాటయ్యే పార్టీకి నియమ నిబంధనలను ఖరారు చేసే అధికారం కూడా ఈ సమావేశం విజయ్‌కే వదిలేసింది. నెలలోగా పార్టీ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారని సమాచారం. తమిళనాడుతోపాటు కేరళలోనూ విజయ్‌కు భారీగా అభిమానులున్నారు. ఆయన పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ విజయ్‌ అభిమానుల సంఘం పోటీ చేసింది. 2026 ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశిస్తానంటూ గతంలోనే ఆయన ప్రకటించారు. 

Advertisement
 
Advertisement