
ప్రముఖ తమిళ నటుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇదివరకే 2014లో ఓసారి కైవల్య అనే అమ్మాయిని వివాహం చేసుకోగా.. ఇప్పుడు మరోసారి కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు నటుడు కృష్ణ కులశేఖరన్ ప్రకటించాడు. దీంతో వరలక్ష‍్మీ శరత్ కుమార్‌తోపాటు పలువురు నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతకీ ఎవరీ నటుడు? టాలీవుడ్‌తో ఏమైనా సంబంధం ఉందా?
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)
తమిళంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన కృష్ణ.. తర్వాత హీరోగానూ పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం వెబ్ సిరీసుల్లో సహాయ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రీసెంట్ టైంలో ఝాన్సీ, పారాచూట్ లాంటి తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సిరీసుల్లో కనిపించాడు. ఇతడు వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 'పంజా' దర్శకుడు విష్ణువర్ధన్ ఇతడికి స్వయానా అన్నయ్య అవుతాడు.
2014లోనే కైవల్య అనే అమ్మాయిని కృష్ణ పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు తమిళ హీరో ఆర్యతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కొన్నాళ్ల తర్వాత భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు మరోసారి పెళ్లి చేసుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. అయితే అమ్మాయి ఎవరు? యాక్టరా కాదా అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న 'ఆరెంజ్' హీరోయిన్)