
ప్రముఖ సీరియల్ నటుడు దర్శన్ (Darshan K Raju) అలియాస్ సార్థక్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. బెస్ట్ ఫ్రెండ్ కాశిన్‌ను పెళ్లాడాడు. అక్టోబర్ 13న వీరి వివాహం జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు సహా అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. నూతన జంట వెడ్డింగ్ స్టిల్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సీరియల్స్ నుంచి సినిమాలు
జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించిన దర్శన్ జంటకు బుల్లితెర తారలు సహా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దర్శన్.. తమిళంలో 'కట్రుకెన్న వేలి' సీరియల్‌లో సూర్య మహదేవన్ పాత్రతో ఫేమసయ్యాడు. అవను మాతే శ్రావణి, అరణ్మనై కిలి వంటి పలు సీరియల్స్ చేశాడు. సౌత్ ఇండియన్ హీరో అనే కన్నడ సినిమాలోనూ హీరోగా నటించాడు.
చదవండి: తొలి తెలుగు సింగర్ ఇక లేరు