ఈరోడ్: తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ ఈ నెల 16వ తేదీన ఈరోడ్‌లో తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇటీవలే ఆ పారీ్టలో చేరిన మాజీ మంత్రి సెంగొట్టయాన్ ఈ మేరకు ఆదివారం పెట్టుకున్న అర్జీని తిరస్కరించినట్లు పోలీసు శాఖ తెలిపింది. అయితే, అదే రోజు ఓ ప్రైవేట్ మ్యారేజీ హాల్‌లో జరిగే సమావేశంలో విజయ్ పాల్గొంటారని సెంగొట్టయాన్ మీడియాకు తెలిపారు.
ఈరోడ్ ప్రాంతం సెంగొట్టయాన్‌కు గట్టిపట్టున్న ప్రాంతం. తొమ్మిది పర్యాయాలు ఇక్కడి నుంచే ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏఐఏడీఎంకే బహిష్కరించడంతో విజయ్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ ర్యాలీని తన బలాన్ని ప్రదర్శించుకునేందుకు వాడుకోవాలని ఆయన భావించారు. అయితే, విజయ్ తలపెట్టిన బహిరంగ సభా వేదికను ఎస్‌పీ సుజాత పరిశీలించారు. ఏడెకరాల సభాస్థలి 70 వేల మందికిపోదని భావిస్తూ అనుమతి నిరాకరించినట్లు చెప్పారు.


