న్యూఢిల్లీ: అసమాన ధైర్యసాహసాలతో దేశాన్ని రక్షిస్తున్న సాయుధ దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన తన సామాజిక మాద్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ‘మన దేశాన్ని అచంచల ధైర్యంతో రక్షించే ధైర్యవంతులైన సాయుధబలగాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
మీ క్రమశిక్షణ, సంకల్పం, స్ఫూర్తి ప్రజలను కాపాడతాయి. మన దేశాన్ని బలోపేతం చేస్తాయి. మీ నిబద్ధత దేశం పట్ల మీకున్న భక్తికి ప్రబల నిదర్శనంగా నిలుస్తుంది’ అని మోదీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. సాయు«ధ దళాల జెండా దినోత్సవ నిధికి ప్రధానమంత్రి విరాళం ఇచ్చారు. ఈ నిధికి విరాళాలు ఇవ్వాలని ప్రజలకు మోదీ విజ్ఞప్తి చేశారు.


