Actress Nalini Reveals About Her Love Marriage And Divorce With Her Husband In Latest Interview - Sakshi
Sakshi News home page

Actress Nalini On Her Marriage, Divorce: విడాకులు ఇచ్చేసి.. భర్త గురించి బాధపడుతోంది!

Jul 26 2023 8:24 AM | Updated on Jul 26 2023 10:02 AM

 Actress Nalini Latest Interview About Husband - Sakshi

సీనియర్‌ నటి నళిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. 1980-90ల్లో క్రేజీ బ్యూటీగా మారింది. అలాంటి సమయంలోనే నటుడు, దర్శకుడు రామరాజన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మనస్పర్థలు కారణంగా విడిపోయి విడాకులు తీసుకున్నారు. 

(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?)

ప్రస్తుతం సినిమాలు, టీవీ సీరియల్స్‌లో అమ్మ పాత్రలు చేస్తున్న నళిని.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవిత అనుభవాలు.. కరెక్ట్‌గా చెప్పాలంటే ప్రేమ, పెళ్లి, విడాకులు గురించి మాట్లాడింది. 'హీరోయిన్‌గా నేను బిజీగా ఉన్నప్పుడు ఏడాదికి 24 సినిమాల్లో నటించా. తినడం, నిద్రపోవడం కోసమే పెళ్లి చేసుకోవాలని భావించాను. అలాంటప్పుడు నటుడు రామరాజన్‌ని లవ్ చేశాను' 

'కొన్నాళ్లకు మా ప్రేమ వ్యవహారం నా తల్లిదండ్రులకు చెప్పడంతో అప్పటినుంచి రామరాజన్‌‌తో నటించడానికి వాళ్లు ఒప్పుకోలేదు. రామరాజన్‌ మంచి నటుడు, తెలియకుండా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నిజంగా ఆయన బంగారు లాంటి మనిషి. తర్వాత మా ఇద్దరికీ ఎందుకో సెట్ కాలేదు. దీంతో విడిపోయాం. పెళ్లి రద్దయినా ఇప్పటికీ ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నా. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు' అని నటి నళిని తన ఆవేదన బయటపెట్టింది. 

(ఇదీ చదవండి: విడాకుల న్యూస్‌పై స్పందించిన కలర్స్ స్వాతి!)

Advertisement
 
Advertisement
Advertisement