నటుడు ఆత్మహత్య, మరణానికి ముందు రెండో భార్య చిత్రహింసలు! | Sakshi
Sakshi News home page

Dancer Ramesh: చావమంటూ రెండో భార్య, కూతురు వేధింపులు.. నటుడి చివరి వీడియో వైరల్‌

Published Wed, Feb 1 2023 2:20 PM

Dancer Ramesh Beaten by Second Wife Before Death, Video Viral - Sakshi

తమిళ నటుడు, డ్యాన్సర్‌ రమేశ్‌ తన పుట్టినరోజు(జనవరి 27)నే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే! కొద్దిరోజుల క్రితం ఆయన 10వ అంతస్థు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే అతడి చావుకు రెండో భార్య కారణమంటూ మొదటి భార్య సంచలన ఆరోపణలు చేసింది. చనిపోవడానికి ముందు రమేశ్‌ను చిత్రహింసలు పెట్టిందని ఆరోపించింది. ఇందుకు సాక్ష్యంగా ఓ వీడియోను సైతం రిలీజ్‌ చేసింది. ఇందులో రమేశ్‌ను అతడి రెండో భార్య దారుణంగా హింసించినట్లు కనిపిస్తోంది. చేతిలో ఓ పొడవాటి కట్టె పట్టుకుని అతడిని చితకబాదినట్లు తెలుస్తోంది.

ఓపక్క తనను కొట్టవద్దని రమేశ్‌ టేబుల్‌ ఫ్యాన్‌ను అడ్డుగా పెట్టుకుని ప్రాధేయపడుతుండగా అతడి రెండో భార్య, కూతురు మాత్రం చచ్చిపోమని శాపనార్థాలు పెడుతుండటం గమనార్హం. నా వల్ల కాదు, చచ్చిపోయేలా ఉన్నానంటూ రమేశ్‌ బాధతో విలవిల్లాడుతుంటే ఉరితాడు తీసుకురమ్మంటావా? అని కూతురు అడగడం మరింత షాకింగ్‌గా ఉంది. వీడియో చివర్లో రెండో భార్య సోఫాలో పెద్ద కట్టెతో కూర్చుని ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా రమేశ్‌ టిక్‌టాక్‌ డ్యాన్స్‌ వీడియోలతో ఫేమస్‌ అయ్యాడు. దీంతో అతడికి డ్యాన్స్‌ జోడి డ్యాన్స్‌ అనే రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ షోలోతో మరింత గుర్తింపు రావడంతో అతడికి సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి. ఇటీవలే తునివులో నటించిన రమేశ్‌ రజనీకాంత్‌ జైలర్‌లోనూ నటించినట్లు తెలుస్తోంది.

చదవండి: పెళ్లిపీటలెక్కిన దర్శకుడు, ఫోటో వైరల్‌
చాలా త్వరగా వెళ్లిపోయావ్‌.. మిస్‌యూ: నమ్రత ఎమోషనల్‌ పోస్ట్‌

Advertisement
 
Advertisement