పెళ్లి చేసుకున్న నటుడు.. వధువుపై ట్రోలింగ్‌ | Kollywood Actor Viraat Married to Naveena Shivaji | Sakshi
Sakshi News home page

పెళ్లిపీటలపై ఏడ్చేసిన ప్రియురాలు.. ఆప్యాయంగా ముద్దుపెట్టిన నటుడు

Apr 18 2024 4:18 PM | Updated on Apr 18 2024 5:12 PM

Kollywood Actor Viraat Married to Naveena Shivaji - Sakshi

అమ్మాయి బాగోలేదని, ఆంటీలా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇద్దరూ అబ్బాయిల్లాగే ఉన్నారు.. ఆమె గుండమ్మలా ఉందని బాడీ షేమింగ్‌ చేస్తున్నారు. శుభమా అని పెళ్లి చే

పెళ్లి అనేది రెండు మనసులను ఒక్కటి చేసే తంతు. రెండు కుటుంబాలను కలిపే గొప్ప ప్రక్రియ. ఎవరి ఇష్టాయిష్టాలను బట్టి వారు తమ భాగస్వాములను ఎంచుకుంటారు. జీవితాంతం వారితో కలిసి ఉండేందుకు ఇష్టపడతారు. అయితే పెళ్లి చేసుకునేవాళ్లు బాగానే ఉన్నా జనాలు మాత్రం కొన్నిసార్లు ఆ జంటను విమర్శిస్తూ ఉంటారు. దంపతుల్లో ఒకరి ఎత్తు తక్కువైందనో, లావుగా ఉన్నారనో, రంగు లేదనో.. జోడీ బాలేదంటూ నోటికొచ్చింది అనేస్తుంటారు.

ప్రియురాలి మెడలో తాళి కట్టిన నటుడు
కన్నడ నటుడు విరాట్‌ విషయంలోనూ అదే జరిగింది. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసిన ఇతడు తర్వాత బుల్లితెరకు షిఫ్ట్‌ అయ్యాడు. తమిళంలో పలు సీరియల్స్‌ చేశాడు. అలాగే రియాలిటీ షోలలో పాల్గొంటున్నాడు. ఏప్రిల్‌ 18న అతడు తన ప్రేయసి నవీన మెడలో మూడుముళ్లు వేశాడు. ఈమె సెలబ్రిటీ మేకప్‌ ఆర్టిస్ట్‌. పలువురు నటీనటుల దగ్గర మేకప్‌ ఆర్టిస్ట్‌గా పని చేసింది. గురువారంనాడు తమిళనాడులోని మహాబలిపురంలో వీరి వివాహం జరిగింది. పుట్టినింటికి దూరమవుతానన్న బాధతో పెళ్లిపీటలపైనే నూతన వధువు కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఆమెను ఓదార్చుతూ నటుడు తనకు ఆప్యాయంగా ముద్దు పెట్టాడు.

పెళ్లికూతురిపై ట్రోలింగ్‌
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు విరాట్‌ పెళ్లి చేసుకున్న అమ్మాయి బాగోలేదని, ఆంటీలా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇద్దరూ అబ్బాయిల్లాగే ఉన్నారు.. ఆమె గుండమ్మలా ఉందని బాడీ షేమింగ్‌ చేస్తున్నారు. శుభమా అని పెళ్లి చేసుకున్న కొత్త జంటను ఆశీర్వదించాల్సింది పోయి ఇలా ఎందుకు తిడుతున్నారని నటుడి అభిమానులు మండిపడుతున్నారు.

చదవండి:  సినిమా కోసం తిరిగి పర్సు ఖాళీ.. అప్పుడు భార్యే..!

Advertisement
 
Advertisement
Advertisement