సామాజిక మాధ్యమాల వినియోగం పెరుగుతున్న సమయంలో వాటి ద్వారా మోసాలు నానాటికీ పెరిగిపోతున్నాయనే చెప్పాలి. ప్రముఖుల పేర్లతోనో, సంస్థల పేరుతోనో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసమో తాజాగా శివకార్తికేయన్ విషయంలో జరిగింది. ప్రముఖ కథానాయకుడిగా రాణిస్తున్న ఈయన 2018లో శివకార్తికేయన్ (ఎస్‌కే) ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి, పలువురు నూతన దర్శకులకు అవకాశాలు కల్సిస్తూ చిత్రాలను నిర్మిస్తున్నారు. అదేవిధంగా మంచి కథలతో రూపొందిన చిన్న చిత్రాలను విడుదల చేస్తున్నారు.
తాజాగా అమ్మాముత్తు సూర్య దర్శకత్వంలో నిర్మిస్తున్న త్వరలో తెరపైకి రానుంది. ఇలాంటి పరిస్థితుల్లో శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్న విషయం శివకార్తికేయన్ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు.
అందులో తమ సంస్థ నిర్మించే చిత్రాల కోసం నటీనటులను ఎంపిక చేయడానికి దర్శకులనో, నిర్వాహకులనో, కాస్టింగ్ ఏజెంట్‌లనో, మరెవరినో ఏర్పాటు చేయమన్నారు. కాబట్టి ఎస్‌కే ప్రొడక్షన్స్ పేరుతో విడుదలయ్యే వివరాలతో కూడిన ప్రకటనలను తమ అధికారిక సామాజిక మాధ్యమాలతో ద్వారానే వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇతర ఏ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని శివకార్తికేయన్ పేర్కొన్నారు. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ పేరును మోసపూరితంగా ఉపయోగిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


